క్యాన్సర్ చికిత్సలో వినియోగించే అంబ్రలిసిబ్ అనే డ్రగ్ అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి పొందినట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్‌లో తయారు చేసిన ఈ డ్రగ్ క్యాన్సర్ చికిత్స కోసం భారత్ నుంచి యూఎస్ఎఫ్డీఏ అనుమతి పొందిన తొలి డ్రగ్‌గా నిలిచిందని ట్విటర్ వేదికగా వెల్లడించారు.
అంబ్రలిసిబ్ డ్రగ్‌కు యూఎస్ఎఫ్డీఏ అనుమతి : మంత్రి కేటీఆర్
తెలంగాణలో అభివృద్ధి చేసిన అంబ్రలిసిబ్ అనే డ్రగ్.. అమెరికాకు చెంది ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి పొందినట్లు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. భారత్ నుంచి క్యాన్సర్ చికిత్సకు యూఎస్ఎఫ్డీఏ అనుమతి పొందిన తొలి డ్రగ్‌గా నిలిచిందని ట్విటర్ వేదికగా తెలిపారు.
అంబ్రలిసిబ్ డ్రగ్‌కు యూఎస్ఎఫ్డీఏ అనుమతి
ఈ డ్రగ్‌ను హైదరాబాద్‌కు చెందిన జీనోం వ్యాలీలో పరిశోధించి, అభివృద్ధి చేశారని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఓరల్‌గా తీసుకునే ఈ డ్రగ్‌ను హైదరాబాద్‌కు చెంది ఇంకోజెన్ థెరపిటిక్స్, ఇతర గ్లోబర్ కంపెనీల భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిందని తెలిపారు. ప్రపంచ ఆరోగ్య రంగానికి హైదరాబాద్ లైఫ్ సైన్సెస్ నుంచి ఇదో కీలకమైన కంట్రిబ్యూషన్ అని.. రాష్ట్ర ప్రజలకు ఈ మైలురాయి ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు.