తెలంగాణ

telangana

ETV Bharat / city

'ఈటీవీ​ భారత్'​ను సందర్శించిన యూఎస్​ కాన్సుల్​ జనరల్​ - undefined

హైదరాబాద్​లోని యూఎస్​ కాన్సుల్ జనరల్​ జోయల్ రీఫ్​మన్... రామోజీ ఫిల్మ్​సిటీలోని 'ఈటీవీ భారత్'​ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. దేశంలోని 13 భాషల్లో నిరంతరం వార్తలను అందిస్తోన్న ఈటీవీ భారత్​ విశేషాలను అడిగి తెలుసుకున్నారు. యాప్ విభాగంలో భారత్​లో మొట్టమొదటిసారి అతిపెద్ద వార్తా స్రవంతిని సృష్టించడం పట్ల ఈనాడు సంస్థల ఛైర్మన్​ రామోజీరావును అభినందించారు రీఫ్​మన్.

us console general
us console general

By

Published : Jan 17, 2020, 9:19 PM IST

రామోజీ ఫిల్మ్​సిటీలోని 'ఈటీవీ భారత్' ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు హైదరాబాద్​లోని యూఎస్​ కాన్సుల్​ జనరల్​ జోయల్​ రీఫ్​మన్​. ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు​తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఈనాడు, ఈటీవి, రామోజీ ఫిల్మ్​సిటీ, ఈటీవీ భారత్​తో తన ప్రయాణాన్ని రీఫ్​మన్​కు రామోజీరావు వివరించారు.

అనంతరం కాన్సులేట్ ప్రజాసంబంధాల అధికారి డ్ర్యూ గిబ్లిన్, మీడియా సలహాదారు మహ్మద్ బాసిత్​తో కలిసి 'ఈటీవీ భారత్​' కార్యాలయాన్ని సందర్శించారు రీఫ్​మన్. 13 భాషల్లో వార్తలను అందిస్తోన్న 'ఈటీవీ భారత్' యాప్​కు సంబంధించిన వివరాలను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్​ బాపినీడు చౌదరి, ఎడిటోరియల్ సిబ్బంది, సాంకేతిక నిపుణులు... రీఫ్​మన్​ బృందానికి వివరించారు.

యాప్ విభాగంలో భారత్​లో మొట్టమొదటిసారి అతిపెద్ద వార్తా స్రవంతిని సృష్టించడం పట్ల రామోజీరావును అభినందించారు రీఫ్​మన్. వేలమంది యువతకు ఉద్యోగాలు కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం వార్తల పోకడలు మారాయని, నూతన పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ వేగవంతమైన, విశ్వసనీయమైన వార్తలను అందించేవారు విజయం సాధిస్తారని పేర్కొన్నారు. యువ జర్నలిస్టులతో మాట్లాడిన కాన్సులేట్ జనరల్... వారితో ఫొటోలు, సెల్ఫీలు తీసుకుని మెరుగైన పనితీరు కనబరచాలని ఆకాంక్షించారు.

'ఈటీవీ​ భారత్'​ను సందర్శించిన యూఎస్​ కాన్సుల్​ జనరల్​

ఇదీ చూడండి: తెలంగాణలో ప్రశాంతంగా జరిగితే.. ఏపీలో రచ్చ జరుగుతోంది..

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details