తెలంగాణ

telangana

ETV Bharat / city

Urban Forest Blocks Telangana : రెండేళ్లలో 12 అర్బన్ ఫారెస్ట్ బ్లాకుల అభివృద్ధి - HMDA Focus on Greenery

Urban Forest Blocks Telangana: తెలంగాణ సర్కార్ పచ్చదనానికి చాలా ప్రాముఖ్యతనిస్తోంది. హరిత హారం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వంటి కార్యక్రమాలతో ప్రజల్లో పచ్చదనంపై అవగాహన పెంచుతోంది. ఇందులో భాగంగా హెచ్​ఎండీఏ.. పార్కులు, పచ్చదనం పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించింది. నర్సరీల్లో పెద్ద ఎత్తున మొక్కలు పెంచడం నుంచి వాటిని నాటడం, సంరక్షణ బాధ్యతలను స్వయంగా నిర్వహిస్తోంది. పట్టణ రిజర్వు ఫారెస్టు బ్లాక్​లను ప్రజోపకరంగా తీర్చిదిద్దుతోంది.

Urban Forest Blocks Telangana
Urban Forest Blocks Telangana

By

Published : Dec 20, 2021, 2:04 PM IST

Urban Forest Blocks Telangana: పార్కులు, పచ్చదనం పెంపకంతో పాటు వాటి నిర్వహణలోనూ హెచ్​ఎండీఏ ఆదర్శంగా నిలుస్తోంది. హైదరాబాద్​ వ్యాప్తంగా మొక్కలు నాటడమే గాక వాటి సంరక్షణ బాధ్యతను చూస్తోంది. ఇప్పటివరకు అత్యధికంగా రంగారెడ్డి జిల్లా అంబర్​పేట్​ కలాన్​లో 2,89,000 మొక్కలు, మేడ్చల్ జిల్లా తుర్కపల్లిలో 2,69,089.. మెదక్ జిల్లా వడియారం క్లస్టర్​ పోలంపల్లిలో 2,26,716 మొక్కలు నాటి పచ్చదనం పెంచేందుకు కృషి చేస్తోంది.

పెద్ద ఎత్తున మొక్కల పెంపకం..

HMDA develops Urban Forest Blocks : హరితహారంలో భాగంగా హెచ్​ఎండీఏ నర్సరీల్లో మొక్కల పెంపకాన్ని చేపడుతోంది. వీటితో పాటు గణపతి విగ్రహాల పంపిణీ, ట్యాంక్​బండ్​పై ఇటీవల కొనసాగిన సండే-ఫండే కార్యక్రమంలో మొక్కల పంపిణీ ద్వారా పచ్చదనం పెంచడానికి తమవంతు ప్రయత్నం చేస్తోంది. వందేళ్ల చరిత్ర సొంతం చేసుకున్న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో హెచ్​ఎండీఏ హరితహారం కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా వర్సిటీ క్యాంపస్​ ప్రాంగణంలో పెద్దఎత్తున మొక్కలు నాటారు.

16 పట్టణ రిజర్వు ఫారెస్టు బ్లాక్స్..

Urban Reserve Forest Blocks : హెచ్‌ఎండీఏలో ఉన్న 16 పట్టణ రిజర్వు ఫారెస్టు బ్లాకులను ప్రజోపకరంగా తీర్చిదిద్దింది. వాటిలో 8-రంగారెడ్డి జిల్లాలో, 3-యాదాద్రి, 3-మెదక్‌, ఒకటి రంగారెడ్డి జిల్లాలో ఉన్నాయి. గత రెండు సంవత్సరాల కాలంలో దాదాపు 93 కోట్ల రూపాయల వ్యయంతో హెచ్‌ఎండీఏ అర్భన్‌ ఫారెస్ట్రీ, ఇంజినీరింగ్‌ విభాగాల అధికారులు వీటిని అభివృద్ధి చేశారు. అర్భన్‌ ఫారెస్ట్‌ బ్లాక్‌ల తీరు అటవీ శాఖ అధికారులను ఆకట్టుకుంది.

అర్బన్ ఫారెస్ట్ బ్లాక్​లపై అటవీ శాఖ అధ్యయనం

HMDA Focus on Greenery : బ్లాక్‌ నమూనాలతో ఉపాధి హామీ పథకం కింద హరిత వనాలను అభివృద్ధి చేయాలని అటవీ శాఖ యోచిస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 21, 23 తేదీలలో అటవీ శాఖ అధికారులు అర్భన్‌ ఫారెస్ట్‌ బ్లాక్‌లను సందర్శించనున్నారు. మొక్కల పెంపకంలో హెచ్‌ఎండీఏ చేపట్టిన మెలకువలు, అనుసరించిన పద్దతులను అధికారులు అధ్యయనం చేయనున్నారు. యాదాద్రి జిల్లాలోని జలాల్‌పూర్‌, బీబీనగర్‌ అర్భన్‌ ఫారెస్టు బ్లాక్‌ను పరిశీలించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details