తెలంగాణ

telangana

ETV Bharat / city

Civils Mains Results: సివిల్స్​ మెయిన్స్ ఫలితాలు విడుదల - సివిల్స్​

Civils Mains Results: దేశంలోనే అత్యున్నత సర్వీసులకు సంబంధించిన సివిల్స్‌ మెయిన్స్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్వ్యూలకు దేశవ్యాప్తంగా 1823 మంది ఎంపికైనట్లు యూపీఎస్సీ వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు వందకుపైగా అభ్యర్థులు ఎంపికైనట్లు తెలుస్తోంది.

Civils Mains Results
Civils Mains Results:

By

Published : Mar 17, 2022, 8:36 PM IST

Civils Mains Results: అఖిల భారత సర్వీసుల్లోకి ఉద్యోగుల ఎంపిక కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్‌ మెయిన్‌‌-2021 పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. జనవరి 7 నుంచి 16 వరకు జరిగిన ఈ పరీక్షల ఫలితాలను యూపీఎస్సీ గురువారం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఇంటర్వ్యూలకు 1,823 మంది అర్హత సాధించినట్లు వెల్లడించింది. ఈ ఏడాది 712 పోస్టులను యూపీఎస్సీ భర్తీ చేయనుంది. ముఖాముఖికి ఎంపికైన అభ్యర్థులు అర్హత, కులం, ఆదాయం ధ్రువీకరణ పత్రాలను ఈనెల 24 నాటికి ఆన్​లైన్​లో సమర్పించాలని యూపీఎస్సీ తెలిపింది. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు వందకుపైగా అభ్యర్థులు ఎంపికైనట్లు తెలుస్తోంది.

ఏప్రిల్ 5 నుంచి ముఖాముఖి

సివిల్స్ మెయిన్స్ రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఏప్రిల్‌ 5 నుంచి ఇంటర్వ్యూలు దిల్లీలో ప్రారంభం కానున్నాయి. దేశంలో ఐఏఎస్‌, ఐఎఫ్‌ఎస్‌, ఐపీఎస్, తదితర అఖిల భారత సర్వీసులకు ఉద్యోగులను ఎంపిక చేసేందుకు యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) ఏటా సివిల్స్‌ పరీక్షను మూడు దశల్లో నిర్వహిస్తుంది. ప్రిలిమినరీ, మెయిన్‌, ఇంటర్వ్యూ దశల్లో ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details