ఉప్పుగల్లు రిజర్వాయర్ నిర్మాణం వల్ల 1,500 పైగా తాటి, ఈత చెట్లు ముంపునకు గురవుతున్నాయని గీత కార్మికులు ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ దృష్టికి తీసుకొచ్చారు. తమ జీవనోపాధికి నష్టం కలుగుతుందని గీత కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. జనగామ జిల్లా జాఫర్ఘడ్ మండలం ఉప్పుగల్లు గ్రామానికి చెందిన గీత కార్మికులు మంత్రిని కలిశారు. తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన ఉప్పుగల్లు గీత కార్మికులు - తెలంగాణ తాజా వార్తలు
జనగామ జిల్లా జాఫర్ఘడ్ మండలం ఉప్పుగల్లు గ్రామానికి చెందిన గీత కార్మికులు మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ని కలిశారు. ఉప్పుగల్లు రిజర్వాయర్ నిర్మాణం వల్ల 1,500పైగా తాటి, ఈత చెట్లు ముంపునకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మంత్రి వెంటనే స్పందించారు.

మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన గీత కార్మికులు
వెంటనే స్పందించిన మంత్రి... జనగామ కలెక్టర్‌తో మాట్లాడారు. బాధిత గీత కార్మికుల జీవనోపాధిని దృష్టిలో పెట్టుకొని వెంటనే 10 ఎకరాల భూమిని కేటాయించాలని ఆదేశించారు. ముంపునకు గురవుతున్న తాటి, ఈత వనంపై దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని ఆబ్కారీ అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి:గూగుల్ 'వసంత రుతువు డూడుల్' సూపర్!