తెలంగాణ

telangana

ETV Bharat / city

గురుకుల కళాశాలల్లో స్పోర్ట్స్ మీట్​కు అపూర్వ స్పందన

క్రీడల్లో గురుకుల పాఠశాలకు, కళాశాలలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. చదువుతో పాటు ఆటల్లో కూడా విద్యార్థినులు రాణించేలా స్పోర్ట్స్ మీట్​ నిర్వహిస్తోంది. మహాత్మ జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థినులు పాల్గొంటున్నారు.

By

Published : Nov 7, 2019, 8:39 AM IST

Updated : Nov 9, 2019, 10:42 AM IST

గురుకుల కళాశాలల్లో స్పోర్ట్స్ మీట్​కు అపూర్వ స్పదన


సంగారెడ్డి జిల్లాలోని ముత్తంగా కళాశాలలో నిర్వహించిన స్పోర్ట్స్ మీట్​లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. రాష్ట్రంలో ఉన్న 8 కళాశాలల నుంచి 35 మంది క్రీడాకారిణులు హాజరయ్యారు. కబడ్డీ, కోకో, వాలీబాల్ షటిల్, టెన్నికాయిట్, హైజంప్, లాంగ్​జంప్​ వంటి 9 రకాల అవుట్​ డోర్​ గేమ్స్.... క్యారమ్స్, చెస్ వంటి ఇండోర్ గేమ్స్ నిర్వహిస్తున్నారు. ఈ క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని గచ్చిబౌలిలో నిర్వహించే సొసైటీ లీగ్​లో పోటీపడనున్నారు. అక్కడ గెలిచిన వారిని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనేందుకు అవకాశం కలుగుతుంది. మూడు రోజులపాటు పండుగలా ఈ క్రీడలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

గురుకుల కళాశాలల్లో స్పోర్ట్స్ మీట్​కు అపూర్వ స్పదన
Last Updated : Nov 9, 2019, 10:42 AM IST

ABOUT THE AUTHOR

...view details