తెలంగాణ

telangana

ETV Bharat / city

సీపీఐ రాష్ట్ర కార్యాలయంపై దాడి... చాడ కారు ధ్వంసం - సీపీఐ కార్యాలయంపై దుండగులు దాడి

సీపీఐ రాష్ట్ర కార్యాలయంపై దుండగులు దాడి చేశారు. ఈ ఘటనలో రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి కారును ధ్వంసం చేశారు. ఈ దాడిపై లోతైన విచారణ జరిపించాలని జాతీయ కార్యదర్శి నారాయణ పోలీసులను కోరారు.

unkown persons attack on cpi state office and destroyed chada venkatreddy car
సీపీఐ రాష్ట్ర కార్యాలయంపై దుండగుల దాడి... చాడ వెంకట్ రెడ్డి కారు ధ్వంసం

By

Published : Sep 13, 2020, 8:55 PM IST

Updated : Sep 13, 2020, 9:10 PM IST

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి కారుపై దుండగులు దాడి చేశారు. పార్టీ రాష్ట్ర కార్యాలయం అవరణలో నిలిపి ఉన్న కారును ధ్వంసం చేశారు. ఘటన స్థలాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, నారాయణగూడ పోలీసులు పరిశీలించారు. దుండగులు ఎవరై ఉంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు. ఈ అప్రజాస్వామిక దాడిని ఖండిస్తున్నట్టు నారాయణ తెలిపారు. ఇది కేవలం రాజకీయ కక్షతోనే ఇద్దరు యువకులు... ద్విచక్రవాహనంపై వచ్చి దాడిచేశారని ఆరోపించారు. దీనిపై లోతైన విచారణ జరిపించాలని కోరారు.

సీపీఐ రాష్ట్ర కార్యాలయంపై దుండగుల దాడి... చాడ వెంకట్ రెడ్డి కారు ధ్వంసం

ఇదీ చూడండి:'స్మారక స్ఫూర్తి కేంద్రం ఏర్పాటుకు సహకరించండి'

Last Updated : Sep 13, 2020, 9:10 PM IST

ABOUT THE AUTHOR

...view details