కేంద్ర ప్రభుత్వ రంగంలో ప్రైవేటీకరణను ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ తీవ్రంగా ఖండించారు. సికింద్రాబాద్ సీతాఫల్‌మండిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పద్మారావు గౌడ్‌తో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ తెలంగాణ శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. వివిధ అంశాలపై వినతి పత్రాన్ని అందించారు.
ఈ నెల 15, 16 తేదీల్లో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ సమ్మె - యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ సమ్మె
కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు నిరసనగా ఈ నెల 15, 16 తేదీల్లో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ సమ్మెకు దిగనున్నారు. విధ డిమాండ్ల సాధనకు మద్దతు పలకాలని ఉపసభాపతి పద్మారావుగౌడ్‌కు యూనియన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.
united forum of banks strike on march 15th and 16th
కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు నిరసనగా ఈ నెల 15, 16 తేదీల్లో సమ్మెను చేపట్టనున్నామని ప్రతినిధులు తెలిపారు. వివిధ డిమాండ్ల సాధనకు మద్దతు పలకాలని పద్మారావుగౌడ్‌కు విజ్ఞప్తి చేశారు. బ్యాంకు సిబ్బంది డిమాండ్లపై తాము సానుకూలంగా ఉన్నామని... తమ పార్టీ అధిష్ఠానానికి నివేదిస్తామని పద్మారావు గౌడ్ పేర్కొన్నారు. సంఘం నేతలు ఆర్ శ్రీరామ్, వెంకట రామయ్య, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.