బ్యాంకులు, బీమా కంపెనీల ప్రైవేటీకరణతో సామాన్య, మధ్యతరగతి ప్రజల ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుందని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ కన్వీనర్ శ్రీరామ్ అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. ప్రైవేటీకరణను నిరసిస్తూ.. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో పలు బ్యాంకు ఉద్యోగులు, అధికారులు ధర్నా నిర్వహించారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
వివిధ రూపాల్లో..
ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మార్చి 1 నుంచి 15 వరకు వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహించనున్నట్లు శ్రీరామ్ వివరించారు. 15, 16 తేదీల్లో సమ్మె చేయనున్నట్లు స్పష్టం చేశారు. కొన్ని బ్యాంకుల ప్రైవేటీకరణ.. ఇన్సూరెన్స్ కంపెనీలో ప్రైవేటు భాగస్వామ్యం ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్లో ప్రకటించడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.