తెలంగాణ

telangana

ETV Bharat / city

'రాష్ట్రం భూమి సేకరిస్తే.. కేంద్రం రోడ్లు నిర్మిస్తుంది' - తెలంగాణలో 8 జాతీయ రహదారులకు శంకుస్థాపన

దేశాభివృద్ధిలో రహదారులు కీలక పాత్ర పోషిస్తున్నాయని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. రాష్ట్రంలో రహదారుల నిర్మాణం, అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో 766కిలోమీటర్ల పొడవైన 14 జాతీయ రహదారుల్లో ఆరింటిని ప్రారంభించిన గడ్కరీ.. ఎనిమిది రోడ్లకు భూమిపూజ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి వరంగల్ నగర జిల్లా ఆరేపల్లి వరకు నిర్మించిన జాతీయ రహదారి 163ని జాతికి అంకితమిచ్చారు.

Union Transport Minister Nitin Gadkari
తెలంగాణలో 14 నూతన జాతీయ రహదారులు

By

Published : Dec 21, 2020, 5:10 PM IST

రోడ్ల అభివృద్ధికి కేంద్రం కృషిచేస్తోందని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. రూ.13,169 కోట్లతో 766 కిలోమీటర్ల పొడవైన 14 జాతీయ రహదారుల్లో ఆరింటిని ప్రారంభించి గడ్కరీ.. మరో ఎనిమిదింటికి శంకుస్థాపన చేశారు. రోడ్ల భద్రతకు, మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్న ఆయన.. భారతమాల ఫేజ్-1 కింద భూసేకరణ చేయడంలో ఆలస్యమవుతోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ ఎంత త్వరగా పూర్తిచేస్తే.. అంత త్వరగా జాతీయ రహదారుల నిర్మాణం పూర్తిచేస్తామని తెలిపారు. భారతమాల ఫేజ్-1 కింద రాష్ట్రంలో 1,076 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారులను రూ.24వేల కోట్లతో అత్యంత నాణ్యంగా నిర్మించతలపెట్టామని వివరించారు.

తెలంగాణలో 14 నూతన జాతీయ రహదారులు

రాష్ట్రాభివృద్ధికి కట్టుబడ్డాం

రాష్ట్రాభివద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. దానికి అనుగుణంగా అన్ని రకాల సహాయ సహకారాలు తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తోందని పేర్కొన్నారు. వేగవంతంగా జాతీయ రహదారుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని కోరారు. భారతమాల ఫేజ్ -1 కింద కేంద్రం 1,076కి.మీల జాతీయ రహదారులను మంజూరు చేసిందని తెలిపారు. దీనికి రూ.24వేల కోట్ల ఖర్చు అవుతుందని ఆయన వివరించారు. రహదారుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 5,787 హెక్టార్ల భూమి సేకరించాల్సి ఉండగా...ఇప్పటి వరకు కేవలం 160 హెక్టార్ల భూమిని మాత్రమే సేకరించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి..వేగవంతంగా భూసేకరణ పూర్తి చేస్తే..అన్ని రోడ్లను వేసేందుకు, నిధులు మంజూరు చేసేందుకు కేంద్రానికి ఎలాంటి అభ్యంతరం లేదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

వేయి కి.మీ.ల రోడ్లు రావాలి

340 కి.మీల పొడవైన ప్రాంతీయ రింగ్ రోడ్ ను మంజూరు చేయడంతో పాటు..పలు కొత్త రోడ్లను మంజూరు చేయాలని కేంద్ర రహదారుల శాఖ మంత్రిని నితిన్ గడ్కరిని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి కోరారు. పలు ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పటికే పలు మార్లు కలిసి విజ్ఞప్తి చేశామని వివరించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 25 రాష్ట్ర రహదారుల శ్రేణికి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారని ప్రశాంత్ రెడ్డి వివరించారు. 3,135 కి.మీ పొడవున కొత్త ఎన్.హెచ్.లు ఏర్పాటు చేస్తామని ఇప్పటి వరకు 1,366కి.మీలు పొడవు మాత్రమే అంగీకరించారన్నారు. మిగిలిన 1,769కి.మీల రోడ్ల నిర్మాణాకి కృషిచేయాలని మంత్రి ప్రశాంత్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కనీసం వెయ్యి కి.మీల జాతీయ రహదారులు రావాల్సిన ఆవశ్యకత ఉందని వివరించారు.

ప్రారంభించినవి :

1.యాదాద్రి-వరంగల్ సెక్షన్ NH-163 రహదారికి సంబంధించి రూ.1,890 కోట్లతో 99కి.మీల వరకు నిర్మించిన రోడ్డు.

2.సూర్యాపేట-నల్గొండ జిల్లాలలో నకిరేకల్ -తానంచర్ల ఎన్.హెచ్-365 లో రూ.605.08 కోట్లతో 66.56కి.మీల వరకు నిర్మించిన రోడ్డు.

3.హైదరాబాద్ - మెదక్ ఓ.ఆర్.ఆర్ రూ.426.52 కోట్లతో 62.92 కి.మీల వరకు నిర్మించిన రోడ్డు.

4.మన్నెగూడ-రావులపల్లి సెక్షన్ లో వికారాబాద్-నారాయణపేట్ జిల్లాల్లో రూ.359.27కోట్లతో 72.53 కి.మీ.లు నిర్మించిన రోడ్డు.

5.ఆత్మకూర్-పర్సా సెక్షన్ లో రూ.230.03 కోట్లతో 34.690 కి.మీల వరకు నిర్మించిన రోడ్డు.

6.మహదేవ్ పూర్ -భూపాలపల్లి సెక్షన్ లో రూ.206.13 కోట్లతో 33.733కి.మీలు నిర్మించిన రోడ్డు.

భూమిపూజ చేసినవి :

7.సూర్యాపేట నుంచి ఖమ్మం రూట్ లో రూ.2,054.29లతో 58.63కి.మీల దూరం గల రోడ్డు.

8.మంచిర్యాల-రేపల్లెవాడ రూట్ లో రూ.1,556లతో 42కి.మీల దూరం గల రోడ్డు.

9.రాంసాన్ పల్లె-మంగులూర్ రూట్ లో రూ.1,551లతో 46.81కి.మీల దూరం గల రోడ్డు.

10.కంది-రాంసాన్ పల్లె రూట్ లో రూ.1304.58లతో 39.98కి.మీల దూరం గల రోడ్డు.

11.రేపల్లెవాడ నుంచి మహారాష్ట్ర బోర్డర్ వరకు రూ.1,247లతో 48.96కి.మీల దూరం గల రోడ్డు.

12.రేపల్లెవాడ నుంచి మహారాష్ట్ర బోర్డర్ వరకు రూ.1,226లతో 52.60కి.మీల దూరం గల రోడ్డు.

13.నాగార్జునసాగర్ సెక్షన్ లోని నల్గొండ జిల్లాలో రూ.369.91లతో 85.45కి.మీల దూరం గల రోడ్డు.

14.నిర్మల్ -ఖానాపూర్ సెక్షన్ లోని నిర్మల్ జిల్లాలో రూ.141.80లతో 21.80కి.మీల దూరం గల రోడ్డు.

ABOUT THE AUTHOR

...view details