కేంద్రపర్యాటక శాఖ మంత్రిగా మరోతెలుగు వ్యక్తి బాధ్యతలుస్వీకరించారు.యూపీఏప్రభుత్వంలో పర్యాటక శాఖమంత్రిగా మెగాస్టార్ చిరంజీవిబాధ్యతలు స్వీకరించగా...నేడుకిషన్‌రెడ్డి ఆ పదవినిఅలంకరించారు.బాధ్యతలుస్వీకరించిన అనంతరం కిషన్‌రెడ్డిమీడియాతో మాట్లాడారు.కరోనా కారణంగా కుదేలైన పర్యాటకరంగానికి పునర్‌వైభవం తెచ్చేందుకు కృషిచేస్తానని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి(KISHAN REDDY) తెలిపారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకల్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికలు అమలు చేయనున్నట్లు వెల్లడించారు. కేబినెట్ మంత్రిగా పదోన్నతి పొందిన కిషన్‌రెడ్డి(KISHAN REDDY)...... తనకు కేటాయించిన శాఖల బాధ్యతల్ని చేపట్టారు.
బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తా..
తొలుత దిల్లీ ట్రాన్స్‌పోర్ట్ భవన్‌లో పర్యాటకశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కుటుంబసభ్యులతో కలిసి తన కార్యాలయంలో పూజలు చేశారు. కేంద్ర సహాయమంత్రులు మీనాక్షి లేఖి, అజయ్‌భట్.. కిషన్‌రెడ్డి(KISHAN REDDY) బాధ్యతల స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం శాస్త్రిభవన్‌లో సాంస్కృతిక శాఖ, విజ్ఞాన్‌భవన్‌లో ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిత్వశాఖ బాధ్యతలను చేపట్టారు. ప్రధాని మోదీ నాయకత్వంలో తనకిచ్చిన బాధ్యతల్ని సమర్ధంగా నిర్వహిస్తానని కిషన్‌రెడ్డి(KISHAN REDDY) విశ్వాసం వ్యక్తంచేశారు.
పర్యాటక రంగానికి పునర్‌వైభవం..
మూడు శాఖలకు సంబంధించి బాధ్యతలు చేపట్టాను. పర్యాటకశాఖలో మరో ఇద్దరు సహాయమంత్రులు ఉన్నారు. సాంస్కృతిక శాఖలో మరో ఇద్దరు సహాయమంత్రులు ఉన్నారు. పర్యాటక శాఖపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. పర్యాటక శాఖ లక్ష్యాలు చేరుకునేందుకు ప్రణాళికలు చేస్తున్నాం. పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయాల్సి ఉంది. అధికారులతో సమీక్షించాక ప్రధాని దిశానిర్దేశంతో ముందుకెళ్తాం. విశేషమైన 3 శాఖలు ప్రధాని మోదీ నాకు అప్పగించారు.
- కిషన్ రెడ్డి, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి
కేంద్ర సహాయ మంత్రి హోదాలోనూ... తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కిషన్‌రెడ్డి(KISHAN REDDY) ప్రత్యేక చొరవ చూపారు. రాష్ట్ర అవసరాలు, కేటాయింపులు, నిధుల విడుదలలో కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూ సకాలంలో పనులు జరపడంలో కీలకపాత్ర వహించారు. చేనేత అభివృద్ధి కార్పొరేషన్ ప్రాంతీయ కార్యాలయ తరలింపు, రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణలో కిషన్‌రెడ్డి(KISHAN REDDY) తన వంతు కృషి చేశారు.
శక్తివంచన లేకుండా కృషి..
దేశవ్యాప్తంగా మహిళల రక్షణకు హెల్ప్ లైన్, జిల్లాల్లో ఆయుష్ కేంద్రాల ఏర్పాటుకు కిషన్ రెడ్డి(KISHAN REDDY) ప్రత్యేక చొరవ తీసుకున్నారు. కరోనా వేళ విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను 'వందే భారత్ మిషన్', విపత్తువేళ లాక్‌డౌన్ నిబంధనల రూపకల్పన, రాష్ట్రాల మధ్య సమన్వయ బాధ్యతలు పర్యవేక్షించారు. కరోనా సంక్షోభంలో సమర్థవంతంగా పనిచేసిన కిషన్‌రెడ్డి(KISHAN REDDY)... మోదీ కేబినెట్‌లో పదోన్నతి పొందారు. ప్రధాని తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుని.. తనకు అప్పజెప్పిన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడంలో శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు.
పర్యాటకరంగానికి పునర్‌వైభవం తెస్తా