Central minister kishan reddy: దయకలిగి ఉండటం మానవ లక్షణం అనే అంశంపై హార్ట్ ఫుల్ నెస్ సంస్థ, యునెస్కో సంయుక్తంగా నిర్వహించిన గ్లోబల్ ఎస్సే రైటింగ్ పోటీల్లో గెలుపొందిన వారికి కన్హ శాంతి వనంలో బహుమతుల ప్రధానోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరై విజేతలకు అవార్డ్స్ అందించి మాట్లాడారు.
'రామచంద్ర మిషన్ సంస్థ ప్రజలలో అనేక రకాలైన మార్పులు తీసుకువస్తోంది. ఆధ్యాత్మికమైన, సామాజిక పరమైన, ఆర్థికపరమైన భావాలను ప్రజలలో పెంపొందిస్తుంది. యోగా, మెడిటేషన్, సమాజంలో క్రైమ్ ఎలా తగ్గించుకోవాలి, ప్రజలలో సోదరభావాన్ని ఎలా పెంపొందించుకోవాలనే లాంటి అద్భుతమైన కార్యక్రమాలను ఈ సంస్థ చేపడుతోంది. వచ్చే 25 ఏళ్లు మనకు అమృత కాలం. ఈ మధ్య కాలం దేశ అభివృద్ధికి అత్యంత కీలకం. వచ్చే ఆగస్టు 15న ప్రతి ఇంటి ముందు 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని త్రివర్ణపతాకాన్ని ఎగురవేయాలి. పాఠశాల విద్య స్థాయిలోనే చిన్నారులకు ఎదుటి వారి పట్ల దయను కలిగి ఉండాల్సిన అవసరాన్ని నేర్పించాలి.'