తెలంగాణ

telangana

ETV Bharat / city

క్రీడల్లో ప్రావీణ్యం ఉంటే ఆత్మస్థైర్యం పెరుగుతుంది: కిషన్ రెడ్డి

Central Minister Kishan Reddy: క్రీడలను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ముషీరాబాద్‌లోని నిర్వహించిన షటిల్ టోర్నమెంటు ముగింపు వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు కె.లక్ష్మణ్​తో కలిసి మంత్రి షటిల్ ఆడారు.

Kishan Reddy
కిషన్ రెడ్డి

By

Published : Mar 21, 2022, 8:22 AM IST

క్రీడల్లో ప్రావీణ్యం ఉంటే ఆత్మస్థైర్యం పెరుగుతుంది: కిషన్ రెడ్డి

Central Minister Kishan Reddy: క్రీడల్లో ప్రావీణ్యం ఉంటే క్రమశిక్షణ, ఆత్మస్థైర్యం పెరుగుతాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ముషీరాబాద్‌లోని కోవ శ్రీనివాస్ మెమోరియల్ ట్రస్టు నిర్వహించిన షటిల్ టోర్నమెంటు ముగింపు వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్​తో కలిసి మంత్రి షటిల్ ఆడారు. టోర్నమెంట్‌లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులను అందజేసి, అభినందించారు. అనంతరం మంత్రి మాట్లాడారు.

'దేశంలో క్రీడా రంగం పట్ల గత ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి చూపింది. అందుకే అంతర్జాతీయ స్థాయిలో ఎక్కువ పథకాలు సాధించలేకపోయింది. రాష్ట్రంలో క్రీడా మైదానాలు లేక పోవడం దురదృష్టకరం. ప్రధాని మోదీ క్రీడల పట్ల శ్రద్ధ చూపడం వల్లనే ఒలింపిక్స్​లో గతం కంటే మెరుగైన పథకాలు సాధించాం. ప్రతి ఇంట్లో పిల్లలు ఏదో ఒక ఆటలో ప్రావీణ్యం పొందడం వల్ల క్రమశిక్షణ, ఆత్మస్థైర్యం పెరుగుతాయి. క్రీడల అభివృద్ధికై మంత్రిగా నేను పాటుపడుతాను.'

- కిషన్ రెడ్డి, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి

ఇదీ చదవండి:TRSLP Meeting: ధాన్యం కొనుగోళ్ల కోసం కేంద్రంపై మరో పోరాటం... నేడు టీఆర్​ఎస్​ఎల్పీ భేటీ

ABOUT THE AUTHOR

...view details