తెలంగాణ

telangana

ETV Bharat / city

బడ్జెట్‌ ప్రసంగం తెరాస వీడ్కోలు ప్రసంగంలా ఉంది: కిషన్​ రెడ్డి - కిషన్​ రెడ్డి వార్తలు

Kishan Reddy on Budget: రాజ్యాంగానికి విరుద్ధంగా... ప్రగతిభవన్‌లో రాసిన తీర్మానం మేరకు.. భాజపా ఎమ్మెల్యేలను శాసనసభ నుంచి సస్పెండ్‌ చేశారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. బడ్జెట్‌ సమావేశాలు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రారంభమయ్యాయని విమర్శించారు. గవర్నర్‌ ప్రసంగం లేకుండా చేసి... ఏ రాష్ట్రంలో లేని విధంగా రాజ్యాంగ పద్ధతులను దెబ్బతీశారని అన్నారు. బడ్జెట్‌ ప్రసంగం తెరాస వీడ్కోలు ప్రసంగంలా ఉందని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు.

kishan reddy
kishan reddy

By

Published : Mar 7, 2022, 7:20 PM IST

Kishan Reddy on Budget: తెలంగాణ ప్రభుత్వ బడ్జెట్ మాటలు కోటలు దాటేలా ఉన్నా... చేతలు మాత్రం అసెంబ్లీ దాటవని కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి విమర్శించారు. 8 ఏళ్ల పాలన చూస్తే అది అర్థమవుతుందని అన్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రజాస్వామ్యబద్ధంగా లేవని ఆరోపించారు. 75 ఏళ్లలో ఏ రాష్ట్రం కూడా గవర్నర్​ను ఈ విధంగా అవమానపర్చలేదని స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలు ప్రారంభించారని... ఇది దిగజారుడు, దివాళకోరుతనమని మండిపడ్డారు. దిల్లీలో కిషన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు.

ప్రగతి భవన్​లో రాసిన తీర్మానం ప్రకారం

గవర్నర్ ప్రసంగం లేకుండా సమావేశాలు జరుపుతున్నందుకు భాజపా ఎమ్మెల్యేలు నిరసన తెలిపితే వారిని సస్పెండ్ చేశారని కిషన్​ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్​లో తెరాస ఎంపీలు ఉభయసభల్లో ఆందోళన చేసినా కేంద్రం సస్పెండ్ చేయలేదని గుర్తు చేశారు. ప్రగతి భవన్​లో రాసిన సస్పెండ్ తీర్మానం ప్రకారం ముగ్గురు భాజపా ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని విమర్శించారు.

ఇదీ చదవండి :శాసనసభ నుంచి భాజపా సభ్యుల సస్పెన్షన్‌

తెరాస ప్రభుత్వం వీడ్కోలు ప్రసంగంలా

శాసన సభలో ఈటలను చూడాల్సి వస్తుందనే సభ ప్రారంభమైన 10 నిమిషాలకే సస్పెండ్ చేశారని కిషన్​ రెడ్డి ఆరోపించారు. ప్రజాస్వామ్యం వ్యతిరేకంగా పాలకులు వ్యవహరిస్తున్నప్పుడు ప్రశ్నించే అధికారం తమ సభ్యులకు ఉంటుందని అన్నారు. బడ్జెట్ ప్రసంగం తెరాస ప్రభుత్వం వీడ్కోలు ప్రసంగంలా ఉందని చెప్పారు. ఒక సంవత్సరం ముందే వీడుకోలు ప్రసంగంలా ఉందని పేర్కొన్నారు. తెలంగాణ వచ్చిన తరువాత కుడా తెరాసయేతరులంతా ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉన్నారని అన్నారు.

నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎందుకు పెట్టలేదు

'నూతన రాష్ట్రంలో నూతనంగా ప్రగతి భవన్ మాత్రం నిర్మించుకున్నారు. తెరాస ప్రభుత్వం వచ్చాక ఉస్మానియా ఆసుపత్రి మూతపడింది. బడ్జెట్​లో 130 లైన్లు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడానికి రాశారు. రాష్ట్ర ప్రభుత్వం పెడతానన్న నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎందుకు పెట్టలేదో చెప్పాలి. విశ్వ విద్యాలయాల్లో రిజర్వేషన్లు కల్పించకపోవడం వల్ల గిరిజనులకు అన్యాయం జరుగుతోంది. ఎంఎంటీఎస్​లో రాష్ట్ర వాటా ఎందుకు ఇవ్వలేదు. కేంద్ర పథకాల నిధులు తమ నిధులుగా చూపారు.' - కిషన్​ రెడ్డి, కేంద్ర మంత్రి

అప్పులు కూడా చెబితే బాగుండేది

అద్భుతంగా బడ్జెట్ ప్రసంగం ఉంది... అప్పులు కూడా చెబితే బాగుండేదని కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి అన్నారు. అంబేడ్కర్ పేరు తీసే అర్హత తెరాసకు లేదని మండిపడ్డారు. రాజ్యాంగ స్ఫూర్తిని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉండాల్సింది కాని అది లేదని అన్నారు. గవర్నర్​ను అవమానించారని ఆరోపించారు. దళిత బంధుకు కేటాయించిన నిధులతో వచ్చే 15 ఏళ్లైనా దళితులకు మేలు జరగదని విమర్శించారు. తెరాస నాయకులకు మేలు జరిగేలా దళిత బంధు ఉందని ఎద్దేవా చేశారు.

శాసనసభలో ఈటలను చూడాల్సి వస్తుందే సస్పెండ్​ చేశారు: కిషన్​ రెడ్డి

ఇదీ చదవండి :అందుకే భాజపా ఎమ్మెల్యేల సస్పెన్షన్: హరీశ్​రావు

ABOUT THE AUTHOR

...view details