kishan reddy on Chakali Ailamma: నిజాం నియంతృత్వ పాలనకు ఈ నెల 17వ తేదీ నాటికి 74 ఏళ్లు పూర్తి చేసుకొని 75 ఏళ్ల వడిలోకి అడుగుపెడుతున్నట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. ఈ వేడుకలను సంవత్సరం పాటు కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా తెలంగాణ విమోచనానికి ఆమె చేసిన త్యాగాలను గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్‌లోని లోయర్ ట్యాంక్‌బండ్‌లో ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి ఎమ్మెల్యే ముఠాగోపాల్‌తో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
స్వాతంత్ర పోరాటంలో తనదైన శైలిలో పోరాడిన చాకలి ఐలమ్మ స్ఫూర్తిని సంవత్సరం పాటు గుర్తు చేసుకుందామన్నారు. హైదరాబాద్ విమోచన ఉత్సవాలను ఈ ఏడాది సెప్టెంబర్ 17 తేదీ నుంచి తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలలో సంవత్సరం పాటు వైభవంగా భారత ప్రభుత్వం తరఫున నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు.