తెలంగాణ

telangana

ETV Bharat / city

ఈటలను రాజకీయంగా దెబ్బతీసేందుకు అనేక కుట్రలు పన్నుతున్నారు: కిషన్​రెడ్డి - ఈటల రాజేందర్ సస్పన్షన్ పై స్పందించిన కిషన్​రెడ్డి

Kishan Reddy fire on Cm Kcr: మాటల గారడీతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో తెరాసను ప్రజలు ఊడ్చేస్తారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. ఈటలపై కక్ష సాధిస్తూ రాజకీయంగా దెబ్బ తీయాలని కుట్రల చేస్తున్నారని మండిపడ్డారు. సికింద్రాబాద్‌లో నిన్న రాత్రి జరిగిన అగ్నిప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు.

Kishan Reddy
Kishan Reddy

By

Published : Sep 13, 2022, 2:11 PM IST

ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరపాలి: కిషన్‌రెడ్డి

Kishan Reddy fire on Cm Kcr: సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలుచేయకుండా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి ధ్వజమెత్తారు. మాటల గారడీతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని మండిపడ్డారు. వేల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులకుప్ప చేశారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే తెరాసను ఊడ్చేస్తారని అన్నారు. సికింద్రాబాద్‌లో నిన్న రాత్రి జరిగిన అగ్నిప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు.

'ఈటలను అసెంబ్లీకి రానివ్వను.. మాట్లాడనివ్వను.. అంటున్నారు. ఈటల ముఖం చూడను అంటున్నారు.. కేసీఆర్ కంటే ఫాసిస్ట్ ఎవరు ? ఈటలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఈటలను రాజకీయంగా దెబ్బతీసేందుకు అనేక కుట్రలు పన్నుతున్నారు. హుజురాబాద్ ప్రజల తీర్పును కాలరాసేలా మాట్లాడుతున్నారు. తెలంగాణ ఏమన్నా మీ జాగీరుగా భావిస్తున్నారా? మరమనిషి అనేమాట అప్రజాస్వామికమా ?.' కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి

సికింద్రాబాద్‌లో నిన్న రాత్రి జరిగిన అగ్నిప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. ఈప్రమాదంలో 8 మంది చనిపోవడం దురదృష్టకమని మంత్రి పేర్కొన్నారు. సికింద్రాబాద్‌లో నిన్న రాత్రి జరిగిన ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. కేంద్రప్రభుత్వం తరపున మృతుల కుటుంబాలకు 2 లక్షలు, గాయాలైన వారికి 50 వేల పరిహారం అందిస్తున్నట్లు తెలిపారు.

గతంలో కూడా హైదరాబాద్​లో ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరిగాయని గుర్తు చేశారు. వాహన తయారీలో లోపం ఉంటే ఎలక్ట్రికల్ వెహికిల్ కంపెనీపై కేసు పెట్టాలని పేర్కొన్నారు. ఇలాంటి కాంప్లెక్స్, అపార్టుమెంట్లలో తనిఖీలు చేయాలన్నారు. అన్ని వ్యాపార సంస్థల వారు, రెసిడెన్షియల్ కాంప్లెక్సుల వారు విధిగా ఎలక్ట్రిక్ వైరింగ్ సిస్టం ఎలా ఉంది అనేది చెక్ చేసుకోవాలని కిషన్​రెడ్డి సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి.. ఎలాంటి సంబంధం లేకుండా ఇక్కడ చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి వారిని ఆదుకోవాలని కోరుతానని తెలిపారు.

సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్​లో ఏర్పాట్లు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. స్వాతంత్య్ర ఉద్యమంలో గుర్తింపు దక్కని ఉద్యమకారులను కేంద్ర ప్రభుత్వం గుర్తించి వారిని స్మరించుకోనున్నట్లు పేర్కొన్నారు. అందులో భాగంగా న్యూ నల్లకుంటలోని నారాయణరావు పవార్ ఇంటికి చేరుకొని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏడాది పాటు వారిని స్మరించుకుంటూ వారి జయంతి, వర్ధంతులను ఘనంగా నిర్వహిస్తామన్నారు. 1948లో అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ నగరంలో జాతీయ జెండాను ఎగురవేసి నిజాం పాలనకు చరమగీతం పాడరాని... సెప్టెంబర్17న నగరంలో ప్రస్తుత హోం మంత్రి అమిత్ షా జాతీయ జెండా ఎగురవేస్తారని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details