తెలంగాణ

telangana

ETV Bharat / city

'దేశంలో సచివాలయం లేని రాష్ట్రంగా మార్చిన ఘనత కేసీఆర్​దే'

Kishan reddy comments: హైదరాబాద్​లోని ఖైరతాబాద్​లో భాజపా నగర శాఖ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ శ్రీ శ్రీ సంత్ రవిదాస్ మహారాజ్ జయంతి కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. సంత్ రవిదాస్ స్పూర్తితోనే ప్రధాని మోదీ ముందుకు వెళ్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

union minister kishan reddy comments on CM KCR
union minister kishan reddy comments on CM KCR

By

Published : Feb 28, 2022, 3:10 AM IST

Kishan reddy comments: ముఖ్యమంత్రి కేసీఆర్​ మీద కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్​లోని ఖైరతాబాద్​లో భాజపా నగర శాఖ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ శ్రీ శ్రీ సంత్ రవిదాస్ మహారాజ్ జయంతి కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. దేశమంతా రవిదాస్ మహారాజ్ జయంతి జరుపుతున్నామని.. ఫిబ్రవరి13 నుంచి వారం పాటు నిర్వహిస్తున్నట్లు కిషన్​రెడ్డి తెలిపారు. సమాజంలోని సాంఘీక దురాచారాలకు వ్యతిరేకంగా రవిదాస్​ పని చేశారని తెలిపారు. సంత్ రవిదాస్ స్పూర్తితోనే ప్రధాని మోదీ ముందుకు వెళ్తున్నారని తెలిపారు.

"కొందరు మహానుభావులు రాజ్యాంగం మార్చాలంటున్నారు. పేదవాడికి, పెద్దవాడికి సమానంగా ఓటు హక్కును రాజ్యాంగం ఇచ్చింది. నేరం చేస్తే ప్రధానిని అయినా జైలుకు పంపించేంత శక్తి ఇచ్చిన ఈ రాజ్యాంగం పనికి రాదట. ఈ రాజ్యాంగం ఆధారంగానే ఉద్యమాలు, బిల్లు పెట్టడం, రాష్ట్ర సాధన, ముఖ్యమంత్రి కావడం జరిగింది. తన కొడుకు సీఎం అవుతాడో లేదో అని... నియంత పాలన కోసం ప్రయత్నిస్తున్నారు. సచివాలయానికి రాకుండా.. దాన్ని కూల్చివేసి... దేశంలో సచివాలయం లేని రాష్ట్రంగా మార్చిన ఘనత కేసీఆర్​కు దక్కుతుంది." -కిషన్ రెడ్డి, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details