తెలంగాణ

telangana

ETV Bharat / city

పీఎంఏవైతో పేదల సొంతింటి కల సాకారం: కేంద్రమంత్రి - Pradhan Mantri Awas Yojana scheme in telangana

ఇల్లు కట్టుకోలేని పేద కుటుంబాలను ఆదుకోవడమే ప్రధాని మోదీ లక్ష్యమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ ముషీరాబాద్​ నియోజకవర్గంలోని నాగమయ్య కుంట బస్తీని సందర్శించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంపై బస్తీ వాసులకు అవగాహన కల్పించారు.

awareness on Pradhan Mantri Awas Yojana scheme
ముషీరాబాద్​లో కిషన్ రెడ్డి పర్యటన

By

Published : Jan 22, 2021, 12:14 PM IST

రాష్ట్రంలోని పేద ప్రజలు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. సొంత ఇల్లు లేని పేదలకు ఇల్లు కట్టుకోవడానికి ఈ పథకం కింద కేంద్రం రుణం అందజేస్తుందని తెలిపారు.

ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, కార్పొరేటర్ సునీత ప్రకాశ్​ గౌడ్​లతో ముషీరాబాద్ నియోజకవర్గంలోని నాగమయ్య కుంట బస్తీని కిషన్ రెడ్డి సందర్శించారు. బస్తీ వాసులకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకంపై అవగాహన కల్పించారు.

ఫిబ్రవరి మొదటి వారంలో దివ్యాంగులకు అవసరమైన అన్ని పరికరాలను ఉచితంగా అందజేయనున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. దివ్యాంగులను ఆదుకోవడంలో రాష్ట్ర సర్కార్ నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. ఇల్లు కోసం దరఖాస్తు చేసుకుని ఐదేళ్లు గడిచినా ఇప్పటి వరకు ప్రభుత్వం మంజూరు చేయలేదని ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వం పీఎంఏవై పథకం కింద నిరుపేదలకు ఇల్లు కట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని లక్ష్మణ్ వివరించారు.

ABOUT THE AUTHOR

...view details