తెలంగాణ

telangana

ETV Bharat / city

'స్వదేశీ ఉత్పత్తులు ప్రోత్సహిస్తేనే యువతకు ఉపాధి' - కిషన్ రెడ్డి లేటెస్ట్ న్యూస్

Kishan Reddy News : స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించినప్పుడే యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. విదేశీ ఉత్పత్తులను తగ్గించి స్వదేశీ ఉత్పత్తులను వినియోగించాలని వ్యాపారవేత్తలకు సూచించారు. హైదరాబాద్‌ మాదాపూర్‌లోని శరత్‌ సిటీ సెంటర్‌ మాల్‌ ఏర్పాటు చేసిన అరైవ్ హోం స్టార్‌ను మంత్రి ప్రారంభించారు. హైదరాబాద్‌ నగరం దేశంలోనే అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతుందని మంత్రి పేర్కొన్నారు.

Kishan Reddy News
Kishan Reddy News

By

Published : May 24, 2022, 10:14 AM IST

Kishan Reddy News : స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించినప్పుడే యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. విదేశీ ఉత్పత్తులను తగ్గించిన స్వదేశీ ఉత్పత్తులను వినియోగించాలని వ్యాపారవేత్తలకు సూచించారు. హైదరాబాద్‌ మాదాపూర్‌లోని శరత్‌ సిటీ సెంటర్‌ మాల్‌ ఏర్పాటు చేసిన అరైవ్ హోం స్టార్‌ను కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కిషన్‌రెడ్డితోపాటు ఎంఆర్‌పీఎస్‌ నేత మందకృష్ణ మాదిగ, ఎమ్మెల్సీ రవీందర్ రావు, శ్రీని ఇన్ ఫ్రా ఎండీ శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్‌ నగరం దేశంలోనే అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఒకవైపు రియల్‌ ఎస్టేట్‌, మరోవైపు ఫర్నీచర్‌ ఉత్పత్తులు, ఇంటీరియల్‌ డిజైన్‌ ఇలా అనేక రకాలైన నూతన ఉత్పత్తులు దేశంలోనే తయారు కావడం అభినందనీయని అన్నారు. వందేళ్ల మన్నిక కలిగిన ఉత్పత్తులను దేశీయం తయారు చేస్తున్నారని తెలిపారు.

ఇంటీరియర్ డెకొరేటింగ్‌లో అనేక విభాగాల్లో ప్రత్యేకంగా యంగ్ ఇంటీరియర్ డిజైనర్‌ టీమ్‌తో ఆకర్షణీయమైన ఇంటీరియర్‌ను రూపొందిస్తున్న నిర్వాహకులు జగదీశ్‌ తెలిపారు. స్పేస్‌ను బట్టి చూడముచ్చటగా ఉండే విధంగా లివింగ్, మాడ్యులర్ కిచెన్, బెడ్, కిడ్స్, గెస్ట్ బెడ్ రూమ్, లాంజ్ స్పేస్ రూమ్‌కి డిజైన్ చేస్తున్నామని చెప్పారు. వినియోగదారుల కోసం ఇక్కడ లివింగ్ రూమ్, కిడ్స్, కిచెన్, డైనింగ్, మాస్టర్ బెడ్ రూమ్స్ నమూనా చూసేందుకు వీలుగా ఇక్కడ ఏర్పాటు చేశామని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details