Union Minister Jitendra Singh : ‘ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్ పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనకుండా చూడాలంటూ’ ప్రధానమంత్రి కార్యాలయం సందేశం పంపినట్లు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అబద్ధమని పీఎంవో మంత్రి జితేంద్రసింగ్ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ట్వీట్ చేశారు.
Union Minister Jitendra Singh Tweet : ‘‘మోదీ హైదరాబాద్ పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనకుండా చూడాలని ప్రధాని కార్యాలయం సందేశం పంపినట్లు తెలంగాణ సీఎం కుమారుడు కేటీఆర్ వ్యాఖ్యానించినట్టుగా మీడియాలో కథనాలు వచ్చాయి. ఇది పూర్తిగా అబద్ధం. పీఎంవో అలాంటి సందేశం ఏదీ పంపలేదు. వాస్తవానికి ఫిబ్రవరి 5న ప్రధానమంత్రి హైదరాబాద్‌కు వెళ్లినప్పుడు, ఆయన కార్యక్రమాల్లో కేసీఆర్ పాల్గొంటారని ఆశించాం. ఆరోగ్యం బాగాలేనందున ఆయన హాజరుకాలేకపోతున్నట్లు సీఎం కార్యాలయమే పీఎంవోకు సమాచారం అందించింది’’ అని జితేంద్రసింగ్ ట్వీట్‌లో పేర్కొన్నారు.