రాష్ట్రంలో కందుల కొనుగోళ్లపై నెలకొన్న పరిస్థతిని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి పార్లమెంట్‌లో ప్రస్తావించారు. విషయంపై కేంద్ర మంత్రి నరేంద్రసింగ్ తోమర్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.
పార్లమెంట్‌లో కోమటిరెడ్డి ప్రశ్న... తోమర్ ఏమన్నారంటే? - పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
రాష్ట్రంలో కందుల కొనుగోళ్ల గురించి పార్లమెంట్‌లో ప్రస్థావన జరిగింది. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి నరేంద్రసింగ్ తోమర్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. గతేడాదితో పోలిస్తే రూ.125 అధిక ధరకు కందులు కొనుగోలు చేస్తున్నామని పేర్కొన్నారు.
"తెలంగాణలో 2.07 లక్షల టన్నుల కంది ఉత్పత్తి అవుతుంది. నాఫెడ్, ఎఫ్‌సీఐ ద్వారా మద్దతు ధరకు కందుల కొనుగోలు చేస్తున్నాం. క్వింటాల్ కందికి కనీస మద్దతు ధర రూ.5,800 చెల్లిస్తున్నాం. గతేడాదితో పోలిస్తే రూ.125 అధిక ధరకు కొనుగోలు చేస్తున్నాం. రాష్ట్ర విజ్ఞప్తి మేరకు 47,500 మెట్రిక్ టన్నుల కందుల కొనుగోలుకు నిర్ణయం తీసుకున్నాం. ఫిబ్రవరి 22 నాటికి 45,500 మెట్రిక్ టన్నులు సేకరించాం. తాజా అంచనాల మేరకు కందుల కొనుగోళ్లను పెంచాం. 51,625 మెట్రిక్ టన్నుల కందుల సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నాం" అని జవాబు ఇచ్చారు.
ఇవీ చూడండి:ఎంపీ వినోద్‌కు తుపాకీ ఎక్కుపెట్టిన పార్లమెంటు సిబ్బంది!