కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Union minister Amit Shah) తిరుపతికి చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో రేణిగుంటకు చేరుకున్నారు(Union Minister Amit Shah reached tirupati news). ఆయనకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం సీఎం జగన్‌తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అమిత్ షా.. తిరుపతిలోని తాజ్ హోటల్‌కు చేరుకుని రాత్రి అక్కడ బస చేస్తారు. రేపు ఉదయం భారత వైమానిక దళ హెలికాప్టర్ లో బయల్దేరి నెల్లూరు జిల్లా వెంకటాచలానికి చేరుకుంటారు. అక్షర విద్యాలయ, స్వర్ణ భారతి ట్రస్టు, ముప్పవరపు ఫౌండేషన్‌లకు సంబంధించిన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. సోమవారం నైపుణ్యాభివృద్ధి కేంద్రం, గ్రామీణ స్వయం సాధికార శిక్షణ సంస్థను సందర్శిస్తారు.
Amit Shah tirupati tour: ఏపీ సీఎం జగన్‌తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అమిత్ షా - సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం
దక్షిణాది ముఖ్యమంత్రులతో జోనల్ కౌన్సిల్(southern zonal council meeting) సమావేశం నిమిత్తం కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Union minister Amit Shah) తిరుపతికి చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో రేణిగుంటకు చేరుకున్న ఆయనకు ఏపీ సీఎం జగన్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం సీఎం జగన్‌తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
Amit Shah tirupati tour
మధ్యాహ్నం స్వర్ణ భారతి ట్రస్టు 20వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. తిరిగి మధ్యాహ్నం 2.40 గంటలకు తిరుపతిలోని తాజ్ హోటల్‌కు చేరుకుంటారు. అదే హోటల్‌లో మధ్యాహ్నం 3 గంటల నుంచి జరిగే సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం(Southern Zonal Council Meet news)లో పాల్గొంటారు.
ఇదీ చదవండి:CM KCR:రేపటి దక్షిణాది జోనల్ కౌన్సిల్ సమావేశానికి సీఎం కేసీఆర్ దూరం