రాష్ట్రంలో అమలవుతోన్న మిషన్ భగీరథ పథకానికి కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ నుంచి మరోసారి ప్రశంసలు అందాయి. ఛత్తీస్‌ఘడ్ పర్యటనలో ఉన్న గజేంద్ర సింగ్ షెకావత్.. దేశంలో వంద శాతం నల్లా కనెక్షన్లు ఇచ్చింది తెలంగాణ రాష్ట్రమేనని ప్రశంసించారని.. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వెల్లడించారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి ధన్యావాదాలు తెలిపారు.
Mission bhagiratha: 'దేశంలో వందశాతం నల్లా కనెక్షన్లు ఇచ్చింది తెలంగాణే'
మిషన్ భగీరథ పథకాన్ని కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రశంసించారని.. రాష్ట్ర గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. పదే పదే ప్రశంసించడమే కాకుండా ఈ పథకానికి నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రిని కోరారు.
ఈ ఘనత సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కే దక్కుతుందని ఎర్రబెల్లి తెలిపారు. గత 25 ఏళ్ల క్రితం సిద్దిపేటలో కేసీఆర్ ప్రారంభించిన మంచినీటి పథకమే మిషన్ భగీరథ పథకమని ఎర్రబెల్లి పేర్కొన్నారు. ఈ పథకానికి ఇప్పటికే అనేక అవార్డులు, రివార్డులు వచ్చాయన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలతో స్వచ్ఛమైన తాగునీటిని ప్రజలకు అందిస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి స్పష్టం చేశారు. పదే పదే ప్రశంసించడమే కాకుండా.. మిషన్ భగీరథకు నిధులు కేటాయించాలని... కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను కోరుతున్నట్లు ఎర్రబెల్లి తెలిపారు.
ఇదీచూడండి:కృష్ణా, గోదావరి బోర్డుల భేటీకి హాజరుకాలేం.. ప్రభుత్వం మరో లేఖ