రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొనసాగిస్తుందా లేదా అన్న విషయమై నిజనిర్ధారణ చేయిస్తామని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య రాయలసీమ ఎత్తిపోతల పథకం వివాదం, ఎన్జీటీ తీర్పు సహా తాజా పరిణామాల నేపథ్యంలో కేంద్ర మంత్రి షెకావత్ ముఖ్యమంత్రి కేసీఆర్తో ఫోన్లో మాట్లాడారు. అనుమతులు లేకుండా ప్రాజెక్టు పనులు జరగకుండా చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఎన్జీటీ ఆదేశాలకు అనుగుణంగా నిజనిర్ధారణ కోసం రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రాంతానికి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు బృందాన్ని పంపిస్తామని చెప్పినట్లు సమాచారం. వీలైనంత త్వరగా బోర్డు బృందం అక్కడకు వెళ్లి పనుల వాస్తవ స్థితిపై నివేదిక ఇస్తుందని.. కేసీఆర్తో షెకావత్ చెప్పినట్లు తెలిసింది.
తెలంగాణ వాదన..
తెలుగురాష్ట్రాల మధ్య జల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ విషయంపై ఇరు రాష్ట్రాల మంత్రుల మద్య మాటల తూటాలు పేలుతున్నాయి. నీటి వాటాలు తేలేవరకు రాయలసీమ ఎత్తిపోతల పనులు నిలుపుదల చేస్తామని నాడు జరిగిన అపెక్స్ కౌన్సిల్ భేటీలో ఏపీ ముఖ్యమంత్రి మాట ఇచ్చారని.. తెలంగాణ మంత్రులు చెబుతున్నారు. సుప్రీంలో తెలంగాణ వేసిన వ్యాజ్యాన్ని ఉపసంహరించుకొంటే.. బ్రిజేష్కుమార్ తీర్పు త్వరగా వచ్చాలా చూస్తామని.. ఏపీ అధికారులు చెప్పారన్నారు. ఇప్పుడు కృష్ణా నీటిని అక్రమంగా తరలించేందుకు ఏపీ యత్నిస్తోందని ఆరోపించారు. ఎన్టీటీ ఆదేశాలు పాటించకుండా రాయలసీమ ఎత్తిపోతల పనులు చేపడుతున్నారని.. కృష్ణా బోర్టుకు లేఖ రాశారు.
ఏపీ వాదన..