జమ్ముకశ్మీర్ ఉగ్రదాడిలో అమరుడైన.. చిత్తూరు జిల్లాకు చెందిన జవాన్ ప్రవీణ్‌కుమార్ రెడ్డి కుటుంబాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఫోన్లో పరామర్శించారు. తిరుమల పర్యటనలో ఉన్న కిషన్‌రెడ్డి.. ఐరాల మండలం రెడ్డివారి పల్లిలో నివసించే ప్రవీణ్ కుమార్ భార్యతో మాట్లాడారు. ఘటన పట్ల సంతాపం వ్యక్తం చేశారు. దిల్లీ నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
వీరజవాన్ ప్రవీణ్ కుమార్ కుటుంబానికి కిషన్‌రెడ్డి ఫోన్
ఏపీలో చిత్తూరు జిల్లా చెందిన వీరజవాన్ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి కుటుంబాన్ని కేంద్రహోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి ఫోన్లో పరామర్శించారు. కేంద్ర ప్రభుత్వం, భాజపా అండగా ఉంటుందని భరోసానిచ్చారు.
వీరజవాన్ ప్రవీణ్ కుమార్ కుటుంబానికి కిషన్‌రెడ్డి ఫోన్