తెలంగాణ

telangana

ETV Bharat / city

union electricity minister: "విద్యుత్‌ మీటర్లపై కేసీఆర్‌ పూర్తిగా అబద్ధాలు చెప్పారు"

union electricity minister: వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు మీటర్లు పెట్టాలని బలవంతం చేయట్లేదని కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి ఆర్కే సింగ్‌ పునరుద్ఘాటించారు. గ్రీన్‌ హైడ్రోజన్‌, గ్రీన్‌ అమోనియా విధాన పత్రాన్ని కేంద్ర మంత్రి గురువారం విడుదల చేశారు.

union electricity minister rk singh
union electricity minister rk singh

By

Published : Feb 17, 2022, 7:51 PM IST

union electricity minister: సౌర విద్యుత్‌ కొనుగోళ్లు, వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్‌ మీటర్ల ఏర్పాటులో.. ఎవరినీ బలవంతం చేయలేదని కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్కే సింగ్​ మరోసారి స్పష్టం చేశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెబుతున్న మాటల్లో ఎలాంటి వాస్తవం లేదని ఆయన తెలిపారు. సౌర విద్యుత్‌ కొనుగోలులో కేంద్రం జోక్యం ఏమీ లేదన్నారు. బహిరంగ వేలం ద్వారానే సౌరవిద్యుత్‌ కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ విషయంలో ఎవరిపైనా కేంద్రం ఎలాంటి ఒత్తిడి చేయదని కేంద్రమంత్రి స్పష్టంచేశారు. గ్రీన్‌ హైడ్రోజన్‌, గ్రీన్‌ అమోనియా విధాన పత్రాన్ని కేంద్ర మంత్రి గురువారం విడుదల చేశారు.

'సౌరవిద్యుత్‌ కొనుగోళ్లలో కేంద్రం.. రాష్ట్రాలను బలవంతం చేస్తోందని కేసీఆర్‌ చెప్పడం పూర్తిగా అబద్ధం. సౌరవిద్యుత్‌ కొనుగోళ్లు బహిరంగ వేలం ద్వారా పారదర్శకంగా జరుగుతోంది. కొనుగోలు చేయడం చేయకపోవడం రాష్ట్రాల ఇష్టం. ఈ విషయంలో కేంద్రం ఎవర్నీ ఒత్తిడి చేయడంలేదు. ఇప్పటికే చాలా రాష్ట్రాలు కొనుగోలు చేస్తున్నాయి. సాగు కనెక్షన్లపైనా కేసీఆర్‌ చెప్పినవి అసత్యాలే. సాగు కనెక్షన్లకు మీటర్లు పెట్టాలని ఏ రాష్ట్రంపై ఒత్తిడి చేయలేదు.'

- ఆర్‌కే సింగ్‌, కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి

కేసీఆర్​ ఏమన్నారు..

"విద్యుత్‌ సంస్కరణలు తెస్తున్నారు.. అందులో భాగంగా ముసాయిదా బిల్లును వివిధ రాష్ట్రాలకు పంపించారు. ఆ బిల్లుపై 7, 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ అభిప్రాయాలను కూడా చెప్పారు. బిల్లు ఆమోదానికి ముందే రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు. విద్యుత్‌ సంస్కరణలు వ్యతిరేకిస్తూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించాం. సంస్కరణలు అమలు చేస్తే అరశాతం ఎఫ్ఆర్‌బీఎం ఐదేళ్ల పాటు ఇస్తామన్నారు. విద్యుత్‌ సంస్కరణలకు అదనపు రుణాలు తీసుకుంటున్నారు. అదనపు రుణాల విషయమై కేంద్ర బడ్జెట్‌లో కూడా చెప్పారు. కేంద్ర ముసాయిదా బిల్లుకు ఏపీ అంగీకరించింది. శ్రీకాకుళం జిల్లాలో 25వేల వ్యవసాయ మోటార్లకు మీటర్లు కూడా పెట్టారు. మిగతా విద్యుత్‌ మీటర్లకు రూ.737 కోట్లతో టెండర్లు పిలిచారు. కేంద్రం చెప్పినట్టు విద్యుత్‌ సంస్కరణలు అమలు చేయకపోతే తెలంగాణ రాష్ట్రం ఐదేళ్లలో రూ.25వేల కోట్లు నష్టపోయే అవకాశముంది. అయినా సరే, మోటార్లకు మీటర్లు పెట్టబోమని స్పష్టంగా చెప్పాం. చరిత్రను కప్పిపుచ్చి భాజపా నేతలు గోల్‌మాల్‌ చేస్తున్నారు. బహిరంగ సభల్లో అన్ని విషయాలు చెప్పలేం. విద్యుత్‌ సంస్కరణలు అమలు చేయమని కేంద్రం చెప్పినట్టు నిరూపిస్తే క్షమాపణ చెబుతానని బండి సంజయ్‌ అన్నారు. ఇవిగో.. ఆధారాలు. బండి సంజయ్‌ క్షమాపణ చెప్పాలి. సాగుకోసం కొత్త విద్యుత్‌ కనెక్షన్లు ఇవ్వకూడదనేది కేంద్ర విధానం. వందశాతం మీటరింగ్‌పై డిస్కంలు చర్యలు తీసుకోవాలన్నారు. వినియోగదారులకు ఏడాదిలోగా విద్యుత్‌మీటర్లు పెట్టాలన్నారు"

-కేసీఆర్, తెలంగాణ ముఖ్యమంత్రి

ఇదీచూడండి:CM KCR: ప్రధాని మోదీ చెప్పేదొకటి.. చేసేదొకటి: సీఎం కేసీఆర్‌

ABOUT THE AUTHOR

...view details