ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని నివేదిత కిశోర్ విహార్ ఎయిడెడ్ పాఠశాల ఉపాధ్యాయురాలు మేకా సుసత్య రేఖ ట్విటర్‌లో పెట్టిన వీడియోపై కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ శనివారం స్పందించారు. ఈ వీడియో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో స్ఫూర్తి నింపిందని తిరిగి ఆయన ట్వీట్ చేశారు. పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు ఏటా ప్రధాని మోదీ విద్యార్థులతో మాట్లాడతారు. దీనికి ఇప్పటి వరకు 5 లక్షల మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగా.. ఇందులో 1500 మందికే ఈ అవకాశం లభిస్తుంది.
ఏపీ టీచర్‌కు.. కేంద్ర విద్యాశాఖ మంత్రి అభినందనలు - రాజమహేంద్రవరం ఉపాధ్యాయురాలికి కేంద్ర మంత్రి అభినందన
ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఉపాధ్యాయురాలిని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ అభినందించారు. పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు ఏటా ప్రధాని మోదీ విద్యార్థులతో మాట్లాడే పరీక్షా పే చర్చ కార్యక్రమానికి... ఎలా సిద్ధపడాలో తెలిపే వీడియోను ఆమె తయారు చేయడంపై ఈ ఘనత సాధించారు.

central govt appreciation to ap teacher
‘పరీక్షా పే చర్చ’ పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమంలో పాల్గొనే విద్యార్థులు.. పరీక్షలకు ఎలా సిద్ధపడాలనే దానిపై సుసత్యరేఖ వీడియో రూపొందించారు. విద్యార్థులను ఎంపిక చేసే విధానంలోని ఐదు అంశాలకు ఎలా సమాధానం ఇవ్వాలనే దానిపై అవగాహన కల్పించారు. సుసత్యరేఖ ఇప్పటికే జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డు అందుకున్నారు.