కొవిడ్ వ్యాక్సినేషన్ కోసం రాష్ట్రంలో పటిష్టమైన ఏర్పాట్లు చేశామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వెల్లడించారు. రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ దృశ్యమాధ్యమం ద్వారా సమీక్షించగా.. వ్యాక్సినేషన్ సన్నద్ధతను రాష్ట్రంలో చేపట్టిన చర్యలను సీఎస్ వివరించారు. హైరిస్కులో పనిచేస్తున్న పంచాయతీరాజ్ కార్మికులకు వ్యాక్సిన్ ఇవ్వాలని కోరారు. డ్రైరన్ అనుభవాలను పరిగణనలోకి తీసుకొని వాక్సినేషన్ అమలుకు వ్యవస్థాపరమైన ఏర్పాట్లు చేయాలని రాజీవ్ గౌబ సూచించారు.
రాష్ట్రాల సీఎస్‌లతో కేంద్ర కేబినెట్ కార్యదర్శి సమీక్ష - కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ
రాష్ట్రాల సీఎస్‌లతో కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లపై ఆరా తీశారు. హైరిస్కులో పనిచేస్తున్న పంచాయతీరాజ్ కార్మికులకు వ్యాక్సిన్ ఇవ్వాలని సీఎస్ కేంద్ర కేబినెట్ కార్యదర్శిని కోరారు.

రాష్ట్రాల సీఎస్‌లతో కేంద్ర కేబినెట్ కార్యదర్శి సమీక్ష
ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని హెల్త్ కేర్ వర్కర్లు, కొవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్లతో పాటు 50ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించామని కేబినెట్ కార్యదర్శి తెలిపారు. మంత్రి ఈటల రాజేందర్ గతంలో చేసిన విజ్ఞప్తి మేరకు ప్రజాప్రతినిధులకు వ్యాక్సిన్ ఇవ్వాలని సీఎస్ సోమేష్‌కుమార్ రాజీవ్ గౌబ దృష్టికి తీసుకెళ్లారు.
ఇదీ చదవండి: మొదటి కరోనా వ్యాక్సిన్ నేనే తీసుకుంటా: మంత్రి ఈటల