రాష్ట్రంలో బ్యాంకులతోపాటు కార్పొరేట్ సంస్థలు తమ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు వ్యాక్సిన్ వేయించే కార్యక్రమాన్ని చేపట్టడం మంచి పరిణామం అని సీఎస్ సోమేశ్‌కుమార్ తెలిపారు. హైదరాబాద్‌లోని కోటి యూనియన్ బ్యాంకు జోనల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సోమేశ్‌కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంకు జనరల్ మేనేజర కబీర్ భట్టాచార్య, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి తదితరులు హాజరయ్యారు.
Vaccination: యూనియన్ బ్యాంకు ఉద్యోగులు, వారి కుటుంబాలకు టీకాలు - Vaccination latest news
హైదరాబాద్‌లోని కోటి యూనియన్ బ్యాంకు జోనల్ కార్యాలయంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. వీలైనంత త్వరగా... యూనియన్ బ్యాంకు ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులకు వ్యాక్సిన్ వేయించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు.. జీఎం కబీర్ భట్టాచార్య తెలిపారు.
![Vaccination: యూనియన్ బ్యాంకు ఉద్యోగులు, వారి కుటుంబాలకు టీకాలు Union Bank Vaccination Programme in hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12036661-66-12036661-1622973434422.jpg)
Union Bank Vaccination Programme in hyderabad
యూనియన్ బ్యాంకు ఉద్యోగులు, వారి కుటుంబాలకు టీకాలు
ఇవాళ ఒకే రోజు వెయ్యి మందికి వ్యాక్సినేషన్ వేయటం శుభపరిణామమని పేర్కొన్నారు. మూడు ప్రైవేటు ఆస్పత్రులతో ఓప్పందం కుదుర్చుకున్న యూనియన్ బ్యాంకు యాజమాన్యం... వీలైనంత త్వరగా తమ ఉద్యోగులకు, కుటుంబ సభ్యులకు టీకాలు వేయటం పూర్తి చేస్తామని ఆ బ్యాంకు జనరల్ మేనేజర్ కబీర్ భట్టాచార్య చెప్పారు. హైదరాబాద్ జోన్ పరిధిలోని ఉద్యోగులకు, కుటుంబసభ్యులకు అందరికీ వ్యాక్సిన్ వేయించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.
ఇదీ చూడండి: Vaccine Drive : మహానగరంలో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్
Last Updated : Jun 6, 2021, 4:51 PM IST