తెలంగాణ

telangana

ETV Bharat / city

Kanipakam: కాణిపాకం ఆలయంలో పాత రథ చక్రానికి నిప్పు - కాణిపాకం ఆలయంలో పాత రథ చక్రానికి నిప్పు

Kanipakam: ఏపీలో కాణిపాకం వరసిద్ధి వినాయకుడి ఆలయ సమీపంలోని స్వామివారి రథానికి సంబంధించిన పాత చక్రాలను తగులబెట్టడం కలకలం సృష్టించింది. ఘటనపై హిందూ సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Kanipakam
కాణిపాకంలో తగులబెట్టిన రథ చక్రాలు

By

Published : Jan 27, 2022, 12:59 PM IST

Kanipakam: ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయకుడి ఆలయ సమీపంలోని గోడౌన్ పక్కన స్వామివారి రథానికి సంబంధించిన పాత చక్రాలను తగులబెట్టడం కలకలం రేపింది. కొన్ని సంవత్సరాల క్రితం తుప్పుపట్టిన రథం చక్రాలను గోడౌన్ పక్కన ఉంచినట్లు అధికారులు తెలిపారు. వాటికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టినట్లు చెప్పారు.

కాణిపాకం ఆలయంలో పాత రథ చక్రానికి నిప్పు

పాత రథ చక్రాలను తగులబెట్టడంపై హిందూ సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఏపీలో గతంలోనూ పలు ఆలయాల్లో ఇలాగే గుర్తు తెలియని దుండగులు రథాలు తగులబెట్టడం, విగ్రహాలు ధ్వంసం చేయడం.. హిందూ సంస్థలు, ప్రతిపక్ష పార్టీల ఆగ్రహానికి దారితీశాయి.

ABOUT THE AUTHOR

...view details