తెలంగాణ

telangana

ETV Bharat / city

unhygienic conditions in hospitals : ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకేసిన పారిశుద్ధ్యం - unhygienic conditions in Hyderabad government hospitals

అసలే వానాకాలం. విషజ్వరాలు విజృంభించే సీజన్. ఇప్పటికే జ్వరాలతో బాధపడుతూ ఆస్పత్రులకు క్యూ కడుతున్న జనం పెరిగిపోతున్నారు. వైరల్ ఫీవర్, మలేరియా, డెంగీ వంటి జ్వరాలతో దవాఖాన వెళ్లిన రోగులకు ఆ రోగాలు తగ్గాలంటే చికిత్సతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. కానీ హైదరాబాద్​లోని ప్రభుత్వ ఆస్పత్రులు డంప్​యార్డులను తలపించేలా ఉన్నాయి. వ్యాధితో ఆస్పత్రికి వచ్చిన తమకు దవాఖాన ఆవరణలోని చెత్తా-చెదారం, దోమలు, కంపు(unhygienic conditions in hospitals) వల్ల వ్యాధితీవ్రత పెరుగుతోందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకేసిన పారిశుద్ధ్యం
ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకేసిన పారిశుద్ధ్యం

By

Published : Sep 14, 2021, 11:36 AM IST

భాగ్యనగరంలోని గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌, నిలోఫర్‌, పేట్లబుర్జు, సరోజిదేవి ఇలా ప్రభుత్వ దవాఖానాల వద్ద పరిస్థితి దారుణం(unhygienic conditions in hospitals) గా ఉంటోందని రోగులు వాపోతున్నారు. ఆయా ఆసుపత్రుల వద్ద పారిశుద్ధ్య పనులు(unhygienic conditions in hospitals) ప్రైవేటు ఏజెన్సీలు నిర్వహిస్తున్నాయి. నిత్యం ఉదయం, సాయంత్రం వార్డులు, బాత్‌రూంలు, ఆసుపత్రి పరిసరాల వద్ద శుభ్రం చేయాలి. రూ.కోట్లు వసూలు చేస్తున్న గుత్తేదారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రిజిస్టర్‌లో చూపిన సిబ్బందికి ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బందికి మధ్య వ్యత్యాసం కనిపిస్తోంది.

గాంధీ, ఉస్మానియా, నిలోఫర్‌లో ఈ దందా కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ మూడు ఆసుపత్రులకు కలిపి నిత్యం 4-5 వేల మంది రోగులు వస్తుంటారు. మరో 2 వేల మంది రోగుల సహాయకులు విచ్చేస్తుంటారు. బయట నుంచి భోజనాలు తీసుకొచ్చి అక్కడే తింటున్నారు. బాత్‌రూం వినియోగం ఎక్కువ. ఎప్పటికప్పుడు శుభ్రం చేయాల్సిన ఉన్నా సరే...పట్టించుకోవడం లేదు. ఆసుపత్రుల ప్రాంగణాల్లో వర్షపు నీరు రోజుల తరబడి నిల్వ ఉండి మలేరియా, డెంగీ, చికున్‌గన్యా కారణమయ్యే దోమలు పెరుగుతున్నాయి. ఉస్మానియాకు చెందిన ఓ వైద్యుడు డెంగీ బారిన పడి.. చివరికి చికిత్సతో కోలుకున్నాడు. పారిశుద్ధ్యం మెరుగుపరిచే దిశగా దృష్టి సారించాలని రోగులు, వారి సహాయకులు కోరుతున్నారు.

రాష్ట్రంలో ఏకైక ప్రభుత్వ చిన్న పిల్లల ఆసుపత్రి అయిన నిలోఫర్‌ వద్ద పరిస్థితి ఇది. నిత్యం వేయి మంది వరకు చిన్న పిల్లలు, గర్భిణులు, బాలింతలు చికిత్స కోసం వస్తుంటారు. ఆసుపత్రిలో మొత్తం మూడు భవనాల వద్ద పారిశుద్ధ్య లోపం వేధిస్తోంది. వానలతో మురుగు చేరి దోమలు పెరుగుతున్నాయి. పరిసరాలుబురదమయంగా మారాయి. రోగులతో వచ్చే సహాయకులు అక్కడే ఉంటూ అక్కడే తింటున్నారు. మిగిలిపోయిన పదార్థాలన్ని అక్కడే పారబోస్తున్నారు. వృథాగా ఉన్న ట్యాంకుల్లోకి వర్షపు నీరు చేరడంతో దోమల ఆవాసాలుగా మారాయి. ఇప్పటికే డెంగీ జ్వరాలతో చాలామంది చిన్నారులు నిలోఫర్‌లో చికిత్స తీసుకుంటున్నారు. చిన్న పిల్లలు, బాలింతలకు ముప్పు పొంచి ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

చిత్రం గాంధీ ఆసుపత్రిలోనిది. ఇటీవలి వరకు కరోనా బాధితులకు సేవలందించిన ఈ ఆసుపత్రిలో ప్రస్తుతం సాధారణ రోగులకు చికిత్స అందిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జ్వరాలు పెరగడంతో ఆ ఆసుపత్రికి రోగుల తాకిడి పెరిగింది. నిత్యం వేయి మందికి పైనే చికిత్స కోసం చేరుతున్నారు. వంద వరకు శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయి. ఈ ఆసుపత్రిలో కూడా పారిశుద్ధ్యం తీసికట్టుగా మారింది. ఆసుపత్రి ఆవరణలో చెత్తాచెదారం పేరుకుపోయి దుర్గంధం వ్యాప్తి చెందుతోంది. వ్యర్థాలు ఆసుపత్రి వార్డుల సమీపంలో గుట్టలుగా పేరుకుంటున్నాయి. మురుగు పొంగుతోంది. చెత్త పక్కనే రోగుల సహాయకులు నిద్ర పోవాల్సిన పరిస్థితి.

నత వహించిన నిమ్స్‌ ఆసుపత్రి వద్ద ఇదీ తీరు. గాంధీ, ఉస్మానియా మాదిరి నిమ్స్‌ ధర్మాసుపత్రి కాదు. ఇక్కడ ప్రతి సేవకు ఖరీదు కట్టి రోగుల నుంచి వసూలు చేస్తున్నారు. అయితే పారిశుద్ధ్యం నిర్వహణ మాత్రం గాలికి వదిలేశారు. ఆసుపత్రి పరిసరాల్లో చెత్తచెదారాన్ని ఎప్పటికప్పుడు తొలగించడం లేదు. బాత్‌రూంలు, వాష్‌ రూం వద్ద దుర్గంధం వెదజల్లుతోంది. కొన్ని వార్డుల వద్ద మురుగు పేరుకుంటోంది. ఆసుపత్రి క్యాంటీన్‌ వద్ద కూడా పారిశుద్ధ్యం సక్రమంగా లేదు. ఎన్నిసార్లు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని రోగులు వాపోతున్నారు.

ABOUT THE AUTHOR

...view details