అకాల వర్షం.. ఖమ్మం మిర్చీ రైతును నిండా ముంచింది. అమ్మకానికి మార్కెట్‌కి తెచ్చిన పంట పూర్తిగా వర్షంలో తడిసిపోయింది. దాదాపు 50వేలకు పైగా మిర్చీ బస్తాలు మార్కెట్‌కు రాగా.. అందులో.. 30వేల బస్తాలు వర్షంలో తడిసిపోయాయి. వర్షానికి తడిసిన నష్టం అంచనా.. లక్షల్లో ఉండే అవకాశం ఉంది. వాహనాల్లో మార్కెట్‌కి తరలించిన మిర్చీ కూడా తడిసిపోయింది.
వర్షం వచ్చింది... మిర్చీ రైతును ముంచింది - వర్షం వచ్చింది... మిర్చీ రైతును ముంచింది
వానొస్తే.. రైతుకు పండుగ. కానీ.. పంట చేతికొచ్చి రేపో.. మాపో అమ్మేద్దామనుకుంటుండగా.. వాన వస్తే ఆరుగాలం చేసిన శ్రమకు కన్నీరే మిగులుతుంది.
వర్షం వచ్చింది... మిర్చీ రైతును ముంచింది
అమ్మకాల కోసం.. పెద్దఎత్తున ఖమ్మం మార్కెట్‌కి మిర్చీ వచ్చింది. గంపెడు ఆశలతో మార్కెట్‌కి తరలించిన మిర్చీ తడిసిపోవడంతో మిర్చీ రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు.