Unemployment in Telangana : జనవరిలో దేశ నిరుద్యోగ రేటు భారీగా తగ్గి 6.57 శాతానికి పరిమితమైంది. 2021 మార్చి తరవాత ఇదే కనిష్ఠ స్థాయి. కొవిడ్ ఒమిక్రాన్ కేసుల తీవ్రత లేనందున, ఆంక్షలను సడలించడంతో దేశం నెమ్మదిగా పుంజుకుంటుండడం ఇందుకు నేపథ్యమని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎమ్‌ఐఈ) వెల్లడిస్తోంది.
తెలంగాణలోనే తక్కువ
Unemployment in Telangana News : జనవరిలో నిరుద్యోగ రేటు పట్టణ భారతంలో 8.16 శాతం; గ్రామీణ ప్రాంతాల్లో 5.84 శాతంగా నమోదైందని తెలిపింది. డిసెంబరులో నిరుద్యోగ రేటు 7.91 శాతంగా నమోదు కాగా.. పట్టణాల్లో ఇది 9.3%; గ్రామాల్లో 7.28 శాతంగా ఉంది. సీఎమ్‌ఐఈ గణాంకాల ప్రకారం.. అత్యంత తక్కువ నిరుద్యోగ రేటును తెలంగాణ రాష్ట్రం నమోదు చేసింది. జనవరిలో ఇక్కడ 0.7 శాతం మాత్రమే కనిపించింది.