చిగురుమామిడి తహసీల్దార్ కార్యాలయ ఘటనలో కనకయ్యను విడుదల చేయాలని కోదండరెడ్డి కోరారు. కనకయ్యను విడుదల చేయడానికి చొరవ చూపాలని గవర్నర్ తమిళిసైను కోరామని చెప్పారు. కనకయ్యను జైల్లో పెట్టిన తర్వాత ఆయనకు పట్టదారు పాస్ బుక్ ఇచ్చారని... ఇన్నిరోజులు పాస్‌బుక్ అలస్యం కావడానికి కారణం ఏమిటో తక్షణమే చెప్పాలని డిమాండ్ చేశారు. విజయారెడ్డి సజీవ దహన ఘటనపై ప్రభుత్వం నుంచి ఏ మాత్రం స్పందన రాలేదని ఆక్షేపించారు.
'రైతు కనకయ్యను విడుదల చేయాలి' - Telangana Congress Kisan Chairman Kodanda Reddy
చిగురుమామిడి తహసీల్దార్ కార్యాలయ ఘటన నిందితుడు కనకయ్యను తక్షణమే విడుదల చేయాలని జాతీయ కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి డిమాండ్ చేశారు. విజయారెడ్డి సజీవ దహన ఘటనపై ఇప్పటి వరకు సీఎం, మంత్రులు స్పందించలేదని ఆక్షేపించారు.
"కనకయ్యను బేషరత్తుగా విడుదల చేయండి"
TAGGED:
AICC Departments and Cells