Ukrainewoman birth to baby: ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు జరుపుతోంది. ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాలపై రష్యా విరుచుకుపడుతోంది. ఇలాంటి తరుణంలో ఉక్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ఆసక్తికరమైన వార్తను ట్విట్టర్‌లో పంచుకుంది. ' బాంబుల వర్షం.. తగలబడుతున్న భవనాలు.. రష్యన్ ట్యాంకుల బీభత్సం.. ఇలాంటి భయానక పరిస్థితుల మధ్య అండర్‌గ్రౌండ్‌లో ఓ పాప జన్మించింది. మేము ఆ పాపను స్వేచ్ఛ అని పిలుస్తాము' అని పేర్కోంది.
baby born in underground: అండర్ గ్రౌండ్‌లో ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఉక్రెయిన్ మహిళ.. ! - అండర్ గ్రౌండ్‌లో ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఉక్రెయిన్ మహిళ..
Ukraine woman birth to baby in underground: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను సాధ్యమైనంత వేగంగా చేజిక్కించుకోవడం కోసం పుతిన్ బాంబుల వర్షం కురిపిస్తుండగా.. ఆ దేశ ప్రజలు బిక్కుబిక్కుమంటూ బంకర్లు, మెట్రో సొరంగాల్లో తలదాచుకున్నారు. ఈ క్రమంలో అక్కడే తలదాచుకున్న గర్భిణీకి ప్రసవవేదన మొదలైంది. భయానక పరిస్థితుల మధ్య పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
Ukrainian woman birth to baby
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం జరుగుతున్న సమయాన.. భయానక పరిస్థితుల మధ్య.. భూగర్భ మెట్రో స్టేషన్‌లో ఆశ్రయం పొందుతున్న మహిళ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఇదీ చూడండి:Russia Ukraine War: శునకంపై ప్రేమతో.. ఉక్రెయిన్‌లోనే భారతీయ విద్యార్థి