తెలంగాణ

telangana

ETV Bharat / city

Hundi Counting: ఉజ్జయిని మహంకాళి అమ్మవారి హుండీ లెక్కింపు పూర్తి - హుండీ లెక్కింపు

ఉజ్జయిని మహంకాళి అమ్మవారి హుండీ లెక్కింపు పూర్తయింది. జోనాల జాతర సందర్భంగా అమ్మవారికి వచ్చిన కానుకలు, హుండీ ఆదాయాన్ని అధికారులు... రెండు రోజుల పాటు లెక్కించారు.

UJJAINI MAHANAKALI HUNDI COUNTING COMPLETED
UJJAINI MAHANAKALI HUNDI COUNTING COMPLETED

By

Published : Sep 2, 2021, 8:20 PM IST

సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి హుండీ లెక్కింపు పూర్తయింది. బుధవారం ప్రారంభమైన హుండీ లెక్కింపు.. రెండు రోజులపాటు సాగింది. ఆలయ మహామండప మొదటి అంతస్తులో కల్యాణ మండపంలో జరిగిన కార్యక్రమానికి అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ, ఆలయ ఈఓజి. మనోహర్ రెడ్డి, ఆణువంశిక ధర్మకర్త కామేశ్వర్ హాజరయ్యారు. రెండు రోజులపాటు హుండీ లెక్కింపు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

బోనాల ద్వారా దాదాపు 64 లక్షల రూపాయలు నగదు, 235 గ్రాముల బంగారం ఆలయానికి సమకూరినట్లు అధికారులు వెల్లడించారు. ఆలయంలో అన్ని రకాల కరోనా జాగ్రత్తలు తీసుకుని డబ్బులను లెక్కించినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details