రేపటి నుంచి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర - ujjaini mahamkali bonala
![రేపటి నుంచి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర రేపటి నుంచి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7979965-340-7979965-1594445785903.jpg)
09:52 July 11
రేపటి నుంచి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర
ఈ నెల 12 నుంచి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర జరగనుంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జాతర ఏర్పాట్లను పరిశీలించారు. కరోనా కారణంగా నిరాడంబరంగా బోనాల జాతర నిర్వహిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. అధికారులు, అర్చకుల సమక్షంలో ఆలయంలోనే బోనాల జాతర నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఆలయ చరిత్రలో మొదటిసారి ఇలాంటి పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉంటూ బోనాలు జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనవసరంగా బయటకు వచ్చి భక్తులు ఇబ్బందులు పడొద్దని తలసాని సూచించారు.
ఇవీ చూడండి:మీ ఇంటికే కరోనా కిట్.. హోం ఐసొలేషన్ బాధితులకు మాత్రమే..!