భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. గర్రెపల్లి మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం జరిగింది. వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు భాజపా కార్పొరేటర్లు పాల్గొన్నారు. రాష్ట్రంలో అధికార పార్టీపై వ్యతిరేకతతో ప్రతిపక్షాలు బలపడుతాయని మహేశ్వర శర్మ పంచాంగ శ్రవణంలో తెలిపారు. బెంగాల్లో అధికారం దగ్గర వరకు వస్తోందని... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పని చేస్తాయన్నారు.
భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా ఉగాది వేడుకలు - ఉగాది శుభాకాంక్షలు
హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు భాజపా కార్పొరేటర్లు పాల్గొన్నారు. అనంతరం పంచాగ శ్రవణం జరిగింది. తెలుగు ప్రజలందరికీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
Ugadi Festival in bjp office in hyderabad
తెలుగు ప్రజలందరికీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కరోనా కారణంగా కోట్లాది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. చీకట్లో నుంచి ప్లవ నామ సంవత్సరంలో వెలుగులోకి అడుగు పెడుతున్నామన్నారు. ఈ ఏడాది మంచి వర్షాలు కురిసి పాడి పంటలతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.