ఆంధ్రప్రదేశ్లోని తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది పర్వదినాన్ని ఏకాంతంగా నిర్వహించనున్నట్టు తితిదే అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. మంగళవారం కోయిల్ఆళ్వార్ తిరుమంజనాన్ని అతితక్కువ మందితో పూర్తి చేశామని, ఎక్కడా పది మందికి మించకుండా పాల్గొన్నారని చెప్పారు. ఈసారి ఉగాది ఆస్థానంలో కేవలం 20 మంది కంటే తక్కువే పాల్గొంటారని వివరించారు. వేకువజామున 3 గంటలకు సుప్రభాత సేవ తర్వాత ఆలయ శుద్ధి చేసి కార్యక్రమాలను ప్రారంభిస్తారన్నారు. బంగారు వాకిలి వద్ద శాస్త్రోక్తంగా కార్యక్రమం నిర్వహిస్తారని వివరించారు.
మరో 21 రోజుల దర్శనాల రద్దు?
ప్రధాని నరేంద్ర మోదీ మరో 21 రోజుల పాటు లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో.. అప్పటి వరకు దర్శనాలు రద్దు చేయాలని తితిదే యోచిస్తోంది. స్వామి వారి కైంకర్యాలు, సేవలను ఏకాంతంగా కొనసాగించనుంది.