తెలుగు పండగల ప్రాముఖ్యతను భావితరాలకు అందజేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని సింగపూర్ తెలంగాణ కల్చరల్ సొసైటీ అధ్యక్షుడు నీలం మహేందర్ అన్నారు. టీసీఎస్ఎస్ ఆధ్వర్యంలో సింగపూర్లో ఉగాది పూజ, పంచాంగ శ్రవణం కార్యక్రమాన్ని దృశ్యమాద్యమం ద్వారా నిర్వహించారు.
సింగపూర్లో ఘనంగా ఉగాది వేడుకలు - ugadi celebrations in singapur
ఉగాది పర్వదినాన్ని తెలుగు ప్రజలు దేశవిదేశాల్లో ఘనంగా నిర్వహించారు. సింగపూర్ తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో దృశ్యమాధ్యమం ద్వారా సింగపూర్లో పండగ వేడుకలు జరుపుకున్నారు.
తెలంగాణ కల్చరల్ సొసైటీ ఉగాది వేడుకలు
ఈ వేడుకలో చిన్నారుల సాంస్కృతిక నృత్యాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో టీసీఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.