తెలంగాణ

telangana

ETV Bharat / city

ఖతార్​లో ఘనంగా ఉగాది సంబురాలు

Ugadi celebration in Qatar: ఖతార్​లో ఆంధ్రకళావేదిక ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. చిన్నారులు, పెద్దల సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. నంది అవార్డు గ్రహీత, సినీ నేపథ్య గాయని ఉష హాజరై.. పాటలు, మాటలతో అలరించారు.

Ugadi celebration in Qatar
ఖతార్​లో ఉగాది సంబురాలు

By

Published : Apr 4, 2022, 5:42 AM IST

Ugadi celebration in Qatar: ఖతార్​లో ఆంధ్రకళావేదిక ఆధ్వర్యంలో ఉగాది సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఐడీఎల్​ ఇండియన్​ స్కూల్​లో 'పండుగ చేస్కో' పేరిట వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన చిన్నారులు, పెద్దల సాంస్కృతిక ప్రదర్శనలు, లఘునాటికలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఖతార్​లో ఉగాది సంబురాలు

నంది అవార్డు గ్రహీత, సినీ నేపథ్య గాయని ఉష హాజరై.. పాటలు, మాటలతో అలరించారు. ఈ కార్యక్రమం తన సొంతింట్లో ఆత్మీయులతో చేసుకొనే వేడుకలా ఉందని ఉష తెలిపారు. ఖతార్​లోని భారత రాయబార కార్యాలయం నుంచి వేడుకల్లో పాల్గొన్న రాజకీయ, సమాచార వ్యవహారాల కార్యదర్శి పద్మ కర్రీ.. ఆంధ్ర కళావేదిక కార్యవర్గాన్ని అభినందించారు. ఇంతమంచి కార్యక్రమంలో పాల్గొన్న గాయని ఉషాకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగు సంఘాల అధ్యక్షులు, కార్యవర్గానికి అభినందనలు తెలిపారు.

ఖతార్​లో ఉగాది సంబురాల్లో సినీ నేపథ్య గాయని ఉష

ఉగాది వేడుకల కార్యక్రమానికి ఖతార్​లోని తెలుగు ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని.. ఆంధ్రకళావేదిక అధ్యక్షుడు వెంకప్ప భాగవతుల ఆనందం వ్యక్తం చేశారు. కేవలం వారం రోజుల్లోనే ఎన్నో అవాంతరాలను అధిగమించి ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషిచేసిన వారికి అభినందనలు తెలిపారు. ఈ వేడుకలకు సుమారు 700 మందికిపైగా హాజరైనట్లు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించేందుకు వీలుకల్పించిన స్పాన్సర్స్​, శుభోదయం సంస్థల అధినేత డా.లక్ష్మిప్రసాద్​కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఖతార్​లో ఉగాది సంబురాలు
ఖతార్​లో ఉగాది సంబురాలు

ఇదీచూడండి:Pragathi bhavan ugadi celebrations: 'శుభకృత్ నామ సంవత్సరంలో అంతా శుభమే'

ABOUT THE AUTHOR

...view details