తెలంగాణ

telangana

ETV Bharat / city

కుర్చీలు, సోఫాలకూ ప్రారంభోత్సవం.. ఇదెక్కడి ఓపెనింగయ్యా సామీ..! - latest news in nellore

MLA Sofa Opening: కార్యాలయ ప్రారంభోత్సవం ఘనంగా ప్లాన్​ చేశారు. ముఖ్య అతిథిగా వచ్చిన ఎమ్మెల్యే ధర్వాజకు కట్టిన రిబ్బన్​ను కత్తెరతో కట్​ చేశారు. ఇంకేముంది కార్యాలయం ఓపెనింగ్​ అయిపోయినట్టే అనుకుంటే పొరపాటే.. ఆఫీస్​లోకి కొత్తగా కొనుక్కొచ్చిన సోఫాలు, కుర్చీలను ఎవరు ప్రారంభించాలి..? వాటిని కూడా ఎమ్మెల్యేనే రిబ్బన్లు కత్తిరించి ప్రారంభించాలి..! అలాగే చేశారు కూడా..!! ఎక్కడ..? ఎవరో చూడండి..

udayagiri-mla-chandra-shekar-reddy-opened-sofa-and-chairs-nellore
udayagiri-mla-chandra-shekar-reddy-opened-sofa-and-chairs-nellore

By

Published : Apr 24, 2022, 4:30 PM IST

MLA Sofa Opening: రిబ్బన్‌ కట్‌ చేసి కార్యాలయాలు, షాపింగ్​మాల్స్​, నూతన నిర్మాణాలు ప్రారంభించడం సర్వసాధారణం.. యంత్రాలు, వాహనాలను కూడా రిబ్బన్లు కట్​ చేసి ఓపెన్​ చేయటం అడపాదడపా చూస్తుంటాం. అయితే.. కుర్చీలు, సోఫాలకు రిబ్బన్​ కట్టి.. వాటిని ఓ ఎమ్మెల్యేతో కట్​ చేపించి ప్రారంభించటమే అసలైన వెరైటీ. అచ్చం అలాంటి సంఘటనే జరిగింది ఏపీలోని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది.

ఉదయగిరిలో నూతనంగా నిర్మాణం పూర్తి చేసుకున్న వైకాపా కార్యాలయ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై.. కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యకర్తలు కొంత అత్యుత్సాహంతో కార్యాలయంలో ఏర్పాటు చేసిన సోఫాలు, కుర్చీలకు కూడా రిబ్బన్లు కట్టారు. వాళ్లు కట్టడం వరకు బాగానే ఉన్నా.. వాటిని కూడా కట్​ చేసి ఎమ్మెల్యే ప్రారంభించటమే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కుర్చీలు, సోఫాలకు కట్టిన రిబ్బన్లను సదరు ఎమ్మెల్యే కత్తెరతో కట్‌ చేస్తున్న ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్​ అవుతున్నాయి.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details