తెలంగాణ

telangana

ETV Bharat / city

'ఉబర్‌లో ప్రయాణించేటప్పుడు ఆపదొస్తే 100కు డయల్ చేయండి' - ఉబెర్ యాప్

Women Safety with Uber APP : రాష్ట్రంలో మహిళల భద్రతకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్న పోలీసు శాఖ.. మహిళా భద్రత విభాగంలో మరో అడుగు ముందుకేసింది. ఉబర్‌తో కలిసి పనిచేయాలని నిర్ణయించింది. ఉబర్‌లో ప్రయాణిస్తున్న మహిళలు తాము ఆపదలో ఉన్నామనిపిస్తే ఒక్క బటన్ నొక్కగానే క్షణాల్లో పోలీసులు ఘటనాస్థలికి చేరుకునే సౌలభ్యం కల్పించేందుకు రంగం సిద్ధం చేస్తున్నామని మహిళా భద్రతా విభాగం అడిషనల్ డీజీ స్వాతిలక్రా తెలిపారు.

Women Safety with Uber APP
Women Safety with Uber APP

By

Published : Jul 19, 2022, 8:53 AM IST

Women Safety with Uber APP : రాష్ట్రంలో మహిళా భద్రతకు చేపట్టిన చర్యల్లో భాగంగా.. మహిళా భద్రతా విభాగం మరో ముందడుగు వేసింది. ఆధునిక సాంకేతిక పద్ధతులను విస్తృత స్థాయిలో ఉపయోగించుకుంటున్నపోలీస్ శాఖ.... "ఉబర్" తో రాష్ట్ర మహిళా భద్రతా విభాగం కలసి పనిచేయనున్నాయి.

పోలీస్ శాఖ కొత్తగా.. ఉబర్‌ పాసింజర్ కారులో ప్రయాణిస్తున్న వారు.. తమకి ఏదైనా ఆపద లేదా ప్రమాదం జరిగితే కేవలం ఒక బటన్ నొక్కితే... వెంటనే సమీపంలోని ప్లీస్ పెట్రోల్ కార్... లేదా బ్లూ కోల్ట్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని తగు రక్షణ నిస్తాయని పోలీసు మహిళా భద్రతా విభాగం అడిషనల్‌ డీజీ స్వాతి లక్రా తెలిపారు. ఉబర్ యాప్‌తో పోలీస్ శాఖ డయల్ 100 తో అనుసంధానించడం వల్ల.. ప్రమాదానికి గురైన మహిళల రియల్ టైమ్‌ లొకేషన్, యూజర్ వివరాలు పోలీసులకు... త్వరితగతిన అందుతాయని ఆమె పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details