తెలంగాణ

telangana

ETV Bharat / city

355 సంవత్సరాల నుంచి పంచాంగ శ్రవణం.. ఈ దర్గా ప్రత్యేకం

Panchanga Sravanam At Dargah: సకల శుభాలకు ఆరంభం.. ఉగాది పర్వదినం! తెలుగువారందరూ ప్రత్యేకంగా ఉగాదిని జరుపుకుంటారు. అందరికీ ఉగాది అనగానే ముందుగా గుర్తొచ్చేది పంచాంగ శ్రవణం.. దేవాలయాలల్లో పంచాంగ శ్రవణం తెలుసు.. కానీ అందుకు విభిన్నంగా దర్గాలో పంచాంగ శ్రవణం ఎప్పుడైనా చూశారా? అక్కడ ఒకటి కాదు.. రెండు కాదు.. గత 355 సంవత్సరాలుగా పంచాంగ శ్రవణం కొనసాగుతోంది. మరి మీకు దాని గురించి తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ స్టోరీ చూసేయండి.

panchanga sravanam
పంచాంగ శ్రవణం

By

Published : Apr 3, 2022, 3:32 PM IST

Panchanga Sravanam At Dargah: ఏపీలోని కర్నూలు జిల్లా కౌతాళం మండల కేంద్రంలోని ఖాదర్ లింగా స్వామి దర్గాలో బ్రాహ్మణుడు బద్రినాథ్ చేత.. ధర్మకర్త మునపాషా, ముస్లిం సోదరులు పంచాంగ శ్రవణం చేయించారు. పత్తి పంట, ఎర్ర ధాన్యం బాగా పండుతాయని, వర్షాలు సంవృద్ధిగా కురుస్తాయని పురోహితుడు తెలిపారు. అంతేకాకుండా 27 నక్షత్రాల్లో 14 నక్షత్రాల వారికి ఈ ఏడాది అనుకూలంగా ఉంటుందని తెలియజేశారు.

పంచాంగ శ్రవణం కార్యక్రమంలో ముస్లిం సోదరులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని కులమతాలకు అతీతంగా ఈ వేడుకను జరుపుకున్నారు. అంతకుముందు ఖాదర్ లింగా స్వామి దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా 355 సంవత్సరాల నుంచి దర్గాలో పంచాగ శ్రవణం చేయడం అనవాయితీగా కొనసాగుతోంది.

355 సంవత్సరాల నుంచి ఈ దర్గాలో పంచాంగ శ్రవణం

ఇదీ చదవండి: National Handball Championship: 'త్వరలోనే హైదరాబాద్ వేదికగా మినీ ఒలింపిక్స్'

ABOUT THE AUTHOR

...view details