తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆటో చక్రాల కింద పడి రెండేళ్ల చిన్నారి మృతి - two years baby died at petbasheerabad ps

పేట్ బషీరాబాద్ పీఎస్​ పరిధిలోని దూలపల్లిలో దారుణం చోటుచేసుకుంది. బుడి బుడి అడుగులు వేస్తూ...అప్పటివరకు కళ్లముందు అడుతూ కనిపించిన ఆ చిన్నారి మృతితో ఆ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. తల్లిదండ్రుల ఆర్తనాదాలు మిన్నంటాయి. టాటాఏస్ ఆటో చక్రాల కింద పడి రెండేళ్ల చిన్నారి మృతి చెందడం అందరినీ కలచివేసింది.

two years baby died in auto accident at dulapally
ఆటో చక్రాల కింద పడి రెండేళ్ల చిన్నారి మృతి

By

Published : Mar 6, 2020, 10:33 AM IST

మేడ్చల్ జిల్లా దూలపల్లిలో టాటాఏస్​ ఆటో వెనుక చక్రాల కింద పడి రెండేళ్ల చిన్నారి మృతి చెందింది. వినీత- శ్రవణ్​ దంపతులు దూలపల్లిలో నివాసముంటున్నారు. వారి రెండేళ్ల కూతురు ఆరాధ్య. గురువారం మధ్యాహ్నం పాప మామ టాటాఏస్ వాహనాన్ని వెనక్కి తీస్తుండగా వెనక చక్రాలు పాప పైకి ఎక్కాయి. ప్రమాదవాశాత్తు జరిగిన ఈ ఘటనలో ఆరాధ్య అక్కడి అక్కడే మృతి చెందింది.

ఘటన స్థలానికి చేరికున్న పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆటో చక్రాల కింద పడి రెండేళ్ల చిన్నారి మృతి

ఇదీ చూడండి:ఏడడుగులు వేశాడు.. ఏడేళ్లు నరకం చూశాడు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details