తెలంగాణ

telangana

ETV Bharat / city

కాగజ్‌నగర్‌ కారిడార్‌లో 2 పులి పిల్లలు - కాగజ్​నగర్​లో రెండు పులి పిల్లల సంచారం

కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్‌నగర్‌ టైగర్‌ కారిడార్‌లో పెద్దపులుల సంఖ్య పెరుగుతోంది. ఆవాసం ఏర్పర్చుకున్నవి, మహారాష్ట్ర నుంచి తాత్కాలికంగా వచ్చినవి కలిపి ఇక్కడ వీటి సంఖ్య డజనుకు చేరింది. వీటికి మరో రెండు పులి పిల్లలు జతయ్యాయి.

two tiger cubs finding in kagajnagar forests
కాగజ్‌నగర్‌ కారిడార్‌లో 2 పులి పిల్లలు

By

Published : Dec 31, 2020, 7:22 AM IST

ఏడాది క్రితం మహారాష్ట్ర నుంచి ఓ ఆడ, ఓ మగ పులి రాగా.. అందులో ఆడపులికి 2 పిల్లలు జన్మించాయి. ప్రస్తుతం వాటి వయసు 5-6 నెలలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అటవీశాఖ ట్రాకర్లు, కెమెరాట్రాప్‌లకు ఈ పులి పిల్లలు చిక్కాయి. తాజాగా మరో రెండు ఆడ పులులు గర్భం దాల్చినట్లు అటవీశాఖ వర్గాలు గుర్తించాయి. అయితే ఈ విషయాల్ని వాటి రక్షణరీత్యా గోప్యంగా ఉంచుతున్నారు.
కాగజ్‌నగర్‌ అడవుల్లో ఫాల్గుణ పులి సామ్రాజ్యం విస్తరిస్తోంది. ఈ పులి గత ఆరేళ్లలో రెండు విడతల్లో 8 పిల్లలకు జన్మనిచ్చింది. ఈ సంతానంలోని రెండు ఆడ పులులు ఇప్పుడు గర్భం దాల్చినట్లు అటవీశాఖ గుర్తించింది. కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో ఓ యువతీ, ఓ యువకుడిని బలిగొన్న పులిని గుర్తించి, బంధించేందుకు అధికారులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. పెద్దపులులు సంచరించే ప్రాంతాల్లో.. భయాన్ని పోగొట్టడంతోపాటు, అవి అడవికి రక్షణ కల్పిస్తాయంటూ.. అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని కొమురంభీం ఆసిఫాబాద్‌ డీఎఫ్‌ఓ శాంతారం ‘ఈనాడు-ఈటీవీ భారత్​’తో పేర్కొన్నారు.

జవాసానికి సమీపంలో పులిజాడ గుర్తింపు
నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్‌ మండలం మొల్లచింతలపల్లి సమీపంలోని పెద్దూటివాగు వద్ద పులిజాడను అటవీశాఖ అధికారులు గుర్తించారు. బుధవారం అక్కడ పులి పాదముద్ర కనిపించిందని అటవీ రేంజర్‌ రవీంద్రనాయక్‌ తెలిపారు.

అదిగో పులి..

కాగజ్‌నగర్‌ కారిడార్‌లో 2 పులి పిల్లలు

హైదరాబాద్‌ నెహ్రూ జూ పార్క్‌ని చూసేందుకు వస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా పులులను చూసేందుకు, ఫొటోల్లో బంధించేందుకు పిల్లలు, పెద్దలు ఆసక్తి చూపుతున్నారు. బుధవారం జూలోని పులుల ఎన్‌క్లోజర్‌లో ఓ పులి నీరు తాగుతూ ఇలా కనిపించింది.

ఇదీ చూడండి:ఆర్. నారాయణమూర్తి అందుకే పెళ్లి చేసుకోలేదు!

ABOUT THE AUTHOR

...view details