రాష్ట్రంలో తాజాగా 2,058 మందికి కరోనా - రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య
08:39 September 15
రాష్ట్రంలో తాజాగా 2058 మందికి కరోనా
రాష్ట్రంలో కొత్తగా 2,058 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు 1,60,571 మంది వైరస్ బారిన పడ్డారు. నిన్న ఒక్కరోజే కరోనాతో 10 మృతి చెందగా... మొత్తం మృతుల సంఖ్య 984కి చేరింది.
వైరస్ బారిన పడి నిన్న ఒక్కరోజే 2,180 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,29,187కి చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 30,400 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వారిలో 23,534 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.