తెలంగాణ

telangana

ETV Bharat / city

Student Unions Fight in OU : ఓయూలో విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ

Student Unions Fight in OU: ఉస్మానియా వర్సిటీలో రెండు విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ జరిగింది. ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ బీఎస్‌ఎఫ్‌ కార్యకర్తల ధర్నా చేశారు. సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయగా.. వారిపై టీఆర్‌ఎస్‌వీ కార్యకర్తలు దాడికి యత్నించారు. ఈ క్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Student Unions Fight in OU
Student Unions Fight in OU

By

Published : Feb 17, 2022, 2:25 PM IST

Student Unions Fight in OU : ఉస్మానియా విశ్వవిద్యాలయంలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ బహుజన స్టూడెంట్‌ ఫెడరేషన్‌ బీఎస్‌ఎఫ్‌ విద్యార్థి నేతలు నిరసనకు దిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెరాస విద్యార్థి విభాగం నేతలు అక్కడికి చేరుకోగా.. ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణ నెలకొంది. టీఆర్ఎస్‌వీ విద్యార్థులు కర్రలతో దాడికి యత్నించగా ఉద్రిక్తత తలెత్తింది. ఆందోళనకు దిగిన విద్యార్థి సంఘం నేతలను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు.

ఓయూలో విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ

ABOUT THE AUTHOR

...view details