తెలంగాణ

telangana

ETV Bharat / city

ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సజీవదహనం - alampuram road accident news

పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెంటపాడు మండల పరిధిలోని అలంపురం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సజీవదహనమయ్యారు.

Accident
ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సజీవదహనం

By

Published : Apr 17, 2020, 4:33 PM IST

గుంటూరు నుంచి తణుకువైపు స్పిరిట్‌ లోడ్‌తో వెళ్తున్న వ్యాన్‌... పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలంలోని అలంపురం.. జాతీయ రహదారికి పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్‌లో మంటలు చెలరేగి డ్రైవర్‌, క్లీనర్‌ సజీవదహనమయ్యారు. క్షణాల్లో వాహనం మొత్తం కాలిపోయింది. డ్రైవర్‌, క్లీనర్‌ తప్పించుకునేందుకు వీల్లేకుండా పోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. తాడేపల్లిగూడెం గ్రామీణ సీఐ రవికుమార్‌ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అగ్నిమాపక యంత్రంతో మంటలను అదుపు చేశారు. అప్పటికే వాహనం పూర్తిగా దగ్ధమైంది. మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సజీవదహనం

ABOUT THE AUTHOR

...view details