తెలంగాణ

telangana

ETV Bharat / city

KTR : పీవీఎన్​ఆర్ ఎక్స్​ప్రెస్​ వేకు రెండు కొత్త ర్యాంపులు ప్రారంభం

హైదరాబాద్ నగరంలో శంషాబాద్ ఎయిర్​పోర్టు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన పీవీఎన్​ఆర్ ఎక్స్​ప్రెస్​ వే కోసం నిర్మించిన అదనపు ర్యాంపులను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రూ.22 కోట్లతో అదనంగా రెండు ర్యాంపులను హెచ్​ఎండీఏ నిర్మించినట్లు తెలిపారు.

pvnr express way, new ramps to pvnr express way, minister ktr
పీవీఎన్​ఆర్ ఎక్స్​ప్రెస్ వే, పీవీఎన్​ఆర్ ఎక్స్​ప్రెస్ వేకు కొత్త ర్యాంపులు, మంత్రి కేటీఆర్

By

Published : May 29, 2021, 2:21 PM IST

హైదరాబాద్ నగరంలో శంషాబాద్ ఎయిర్ పోర్టు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వేకు ఉప్పర్​పల్లిలో నిర్మించిన అదనపు ర్యాంపులను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మెహదీపట్నం నుంచి రాజేంద్రనగర్ వరకు 11.6 కి.మీ పొడువుగా పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్​ వే ఉంది. నూతనంగా రూ.22 కోట్లతో అదనంగా.. కింద, పైన ర్యాంపులను హెచ్ఎండీఏ నిర్మించింది.

మెహదీపట్నం నుంచి ఎయిర్ పోర్టుకు వెళ్లే మార్గంలో పిల్లర్ నెం. 161 వద్ద ఎక్స్ ప్రెస్ వే పైకి ఎక్కేలా ఒకటి, ఎయిర్ పోర్టు నుంచి వస్తున్న క్రమంలో అత్తాపూర్​లో పిల్లర్ నెం.163 వద్ద దిగేలా నిర్మించిన ఈ ర్యాంపులను మంత్రి ప్రారంభించారు. ఈ ఎక్స్ ప్రెస్ వేకు గతంలో ఇరువైపుల ఎక్కి, దిగేందుకు 6 ర్యాంపులు ఉండేవి... నూతనంగా నిర్మించిన ర్యాంపులతో వాటి సంఖ్య 8కి చేరింది.

ఈ కార్యక్రమానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, సీఎస్ సోమేష్ కుమార్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ హాజరయ్యారు.

ABOUT THE AUTHOR

...view details